అవును.. సినీనటుడు రామ్ చరణ్‌ తేజ పవన్ కల్యాణ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం ఆయనే చెప్పాడు. ఎందుకో తెలుసా.. తన నుంచి సహకారం కావాలని బాబాయ్ ఫోన్ చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఫోన్‌ వస్తే మాత్రం పరుగెత్తుకుంటూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సంబంధిత చిత్రం


ఇదంతా జనసేన పార్టీ గురించే.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్‌కు అన్నివిధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. పవన్ తన బాబాయి.. అని ఆయన అడిగితే కాదనే సమస్యే ఉండదని చరణ్ అంటున్నారు.

సంబంధిత చిత్రం


ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌ కు మద్దతుగా మెగా కాంపౌండ్ హీరోలు నిలుస్తారా.. లేదా అన్నచర్చ అటు సినీరంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ జరుగుతోంది. ఇప్పటికే నాగబాబు, వరణ్‌ తేజ్‌ తమ వంతు సాయంగా పార్టీకి విరాళం కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ తేజ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

ramcharan teja pawan kalyan కోసం చిత్ర ఫలితం


చరణ్‌ తండ్రి చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో తమ్ముడుగా పవన్ కల్యాణ్ తన వంతు సాయం చేశారు. అన్నకు అండగా నిలిచారు. మరి ఇప్పడు తమ్ముడుకి చిరంజీవి, ఆయన కుమారుడు చరణ్ అండగా నిలుస్తారా అన్నది ఆసక్తికరమే. సాయం చేసేందుకు రెడీ అంటూనే పవన్‌ ఫోన్‌ చేయాలని మెలిక పెట్టడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: