ఈ మధ్య తెలుగు లో బూతు సినిమా లకు కరువు లేదని చెప్పాలి. డబ్బు కోసం భరి తెగించి మరి విచ్చలవిడిగా బూతు కంటెంట్ ను ప్రజల్లోకి వదులుతున్నారు. ఇటువంటి సినిమాలంటే యువత ఎగబడుతుందిలే ... అయితే  అసలు విషయానికొస్తే బాలీవుడ్‌లో 'క్యా సూపర్‌ కూల్‌ హై హమ్‌' అనే ఓ అడల్ట్‌ కామెడీ మూవీ వచ్చింది. అది అప్పట్లో పెను సంచలనం.. సక్సెస్‌ విషయంలో కాదు, వివాదాల విషయంలో.

'చీకటి గది'లో 'కత్తి' లాంటి ఎంట్రీ.!

దాన్ని బ్యాన్‌ చేయాలంటూ పెద్ద రచ్చే జరిగింది. 'డబుల్‌ మీనింగ్‌'కి పరాకాష్ట అది. ఫొటోలతోనే సెగలు పుట్టించేశారు. కామెడీతో కాకుండా, హర్రర్‌ని లింక్‌ చేసి.. అడల్ట్‌ మూవీని తమిళంలో తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్‌. గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా నటించిన సినిమా అది. కానీ, సినిమాలోని అడల్ట్‌ కంటెంట్‌ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది.. హర్రర్‌ ఎలిమెంట్స్‌ అలరించలేకపోయాయి.


అదే సినిమాని, తెలుగులోకి 'చీకటి గదిలో చితక్కొట్టుడు' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. తాజాగా ఈ 'చీకటి గదిలో చితక్కొట్టుడు' టీజర్‌ విడుదలయ్యింది. అడల్ట్‌ కంటెంట్‌ తప్ప, ఇందులో మరో విశేషం కన్పించలేదు. అన్నట్టు, 'క్రిటిక్‌' కత్తి మహేష్‌ ఈ టీజర్‌ లో సినిమా కథని నేరేట్‌ చేస్తూ కనిపించడం గమనార్హం. 'మూడు రోజులు ఆడే సినిమా.. డిబేట్లు పెట్టి హిట్‌ చేసెయ్యొద్దు..' అంటూ ఆయనే టీజర్‌కి ముగింపు ఇచ్చాడు కూడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: