మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఎమ్మెస్ ధోని బయోపిక్ లో నటించి మెప్పించిన కియరా అద్వాని తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.


ఇక ప్రస్తుతం మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన కియరా తన తర్వాత సినిమా కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ఇదిలాఉంటే చరణ్ కు సంబందించిన ఓ టాప్ సీక్రెట్ బయట పెట్టి మెగా ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది కియరా అద్వాని. అదెలా అంటే రాం చరణ్ కు ఫేస్ బుక్ ఎకౌంట్ ఉంది కాని ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రాం ఎకౌంట్స్ లేవు అయితే చరణ్ కు ఓ సీక్రెట్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ ఉందని చెప్పుకొచ్చింది కియరా.


మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఆ ఎకౌంట్ ఏంటా అని వెతికే పనిలో పడ్డారు. మెగా ఫ్యాన్స్ అందరికి కియరా గట్టి పని చెప్పినట్టే అనిపిస్తుంది. చరణ్ సీక్రెట్ గా ఇన్ స్టాగ్రాం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అందరికి తెలిసేలా చేయొచ్చు కదా ఒకవేళ దానిలో ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్.


మొత్తానికి చరణ్ తో ఒక సినిమా చేసిన కియరా తన సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తుంది. సినిమాలో తన పాత్ర గురించి కూడా చెప్పింది. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకళా చరణ్ తో ఉన్నప్పుడు పూర్తిగా డామినేటెడ్ గా ఉంటుందని చెప్పింది. వివి ఆర్ హిట్ అయితే కియరా క్రేజ్ తెలుగులో మరింత స్టాంగ్ కానుంది. సినిమా అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: