ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారి తండ్రి పాత్రను కొడుకు నటిస్తూ నిర్మింపబడ్డ ఎన్టీఆర్ బయోపిక్ ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ఈచరిత్రకు సంబంధించిన విశేషాలను వివరిస్తూ ఈరోజు ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ గా మార్చడంలో తనతల్లి బసవతారకం ప్రోత్సహన్ని ఆమె చేసిన విశేష కృషిని వివరంగా వివరించాడు. 
Balakrishna in NTR biopic
తనతల్లి అనుక్షణం ఎన్టీఆర్ కోసమే ఆలోచనలు చేసిందనీ ఆమెచేసిన త్యాగం పిల్లల పెంపకం పై చూపించిన శ్రద్ద తనజీవితంలో మరిచిపోలేను అంటూ బాలయ్య తనతల్లి పై ప్రశంసలు కురిపించాడు. ఇదేసందర్భంలో తనతండ్రి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ షూటింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరేడప్పుడు తనతండ్రి తనతల్లికి ఫోన్ చేసి తనకు గారెలు తినాలని ఉంది అంటూ అడగడమే కాకుండా తాను ఇంటికి వచ్చే సమయానికి రెడీ చేసి పెట్టమని అడగడమే కాకుండా ఇంటిలోని వంటవాళ్ళ చేతితో కాకుండా తన తల్లి స్వయంగా గారెలు చేసిపెట్టాలని ఆరోజులలో ఎన్టీఆర్ తన తల్లిని రకరకాల వంటల నిమిత్తం అడిగిన వింత కోరికలను బయటపెట్టాడు. 

ఇదేసందర్భంలో ఈసినిమాకు సంబంధించి మరొక ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ ఎన్టీఆర్ నటించిన అనేక పాత్రలకు సంబంధించిన గెటప్ లు ఈసినిమాలో వేయడంతో ఈసినిమా నిడివి మూడున్నర గంటలకు చేరిపోవడంతో చాలకష్టపడి చేసిన అనేక సీన్స్ ను ఈమూవీ నిడివి రీత్యా తగ్గించినప్పుడు తనకు కలిగిన బాధను వివరించాడు. ఇక ఈమూవీకి సంబంధించి దర్శకుడు మార్పు పై జరిగిన విషయాలను వివరిస్తూ ఒక సినిమాతీయాలి అనుకున్న తరువాత దూసుకుపోవాలి కానీ సందేహాలతో అడుగులు వేస్తే కుదరదు అనీ తేజా ఈసినిమాకు సంబంధించిన బాధ్యతలను మోయలేను అని చెప్పడంతో క్రిష్ ఈప్రాజెక్ట్ లోకి వచ్చిన విషయాన్ని వివరిస్తూ విధి లిఖితం ఎవరు తప్పించలేరు అంటూ కామెంట్ చేసాడు బాలకృష్ణ.
New NTR Poster Features Moment Between Nandamuri Balakrishna And Rana Daggubati
ఇదే సందర్భంలో తనభార్య వసుంధర ఈమూవీ ప్రాజెక్ట్ కు ఇచ్చిన సహకారం గురించి వివరిస్తూ తనభార్య లేకుంటే ఈమూవీ నిర్మాణం జరిగేది కాదనీ వాస్తవానికి ఇలాంటి బయోపిక్ లు తీస్తే లాభాలు వస్తాయని ఎవరూ అనుకోరని కామెంట్స్ చేసాడు. ఆడపిల్లలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేసాము కదా ఇక ఆర్ధికంగా మనకు బాధ్యతలు ఏమి ఉన్నాయి అంటూ తనభార్య తనను ప్రశ్నించడంతో తాను డబ్బు గురించి లెక్క చేయకుండా ఈప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన సాహసం చేసాను అని అంటున్నాడు. ఇక ఆఖరిగా ఈసినిమా గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాలకు కమర్షియల్ ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్ జీవితంలోని చాలతెలియని విషయాలు నేటితరానికి తెలియచేయాలి అన్న ఉద్దేశ్యంతో తాను ఈసినిమాను తీసాను కాని తనతండ్రి పేరుతో లాభాలు సంపాధించడానికి కాదు అంటూ కామెంట్స్ చేసి ఈసినిమా పై మరిన్ని అంచనాలు పెంచుతున్నాడు ఈలెజెండ్..



మరింత సమాచారం తెలుసుకోండి: