ఆ పాట మధువుల మూట. సరాగాల స్వరఝరి. సెలయేళ్ళ సవ్వడి. మధువుల గని. ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివ్వని సడులసుడి. చాలాకాలం తరవాత వేల సార్లు విన్నా దాహం తీరని వీనుల విందు బహు పసందు. ఎన్ని ఎడ్జెక్టివ్స్ వాడినా సరిపోని పద ప్రవాహం పదలయ సరాగం. ఆ పాటే ఒక ఫిదా. ప్రిన్స్ వరుణ్ తేజ్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంట కనువిందు చేసిన పదనిసల "వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే?" అంటూ జాలువారిన మధుప్రియ గానం, సుద్ధాల పద ప్రవాహం. టోటల్ గా ప్రేక్షకజన సందోహం ఆనందడోలికల్లో పరవశం. 
vachinde song beautiful sai pallavi కోసం చిత్ర ఫలితం
తెలుగులో అత్యంత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఫిదా" దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌ - బస్టర్ ఫలితాలతో తడిసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటినా ఈ పాట మాత్రం, ఇంకా జనాల మదిలోనే కాక నాలుకలపై కూడా నర్తిస్తుంది. అప్పుడప్పుడు వార్తల్లోకి ప్రవహిస్తూనే ఉంది. "వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే.." అంటూ సింగర్ మధుప్రియ పాడిన అశోక్ తేజ గీతానికి స్పింగులు మింగినట్లు సాయిపల్లవి తన నృత్యంతో నర్తించి అందరినీ ఫిదా చేసిన ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాప్ రికార్డు ను సొంతం చేసుకుంది.
Image may contain: 1 person, camera and closeup 
ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఈ పాట, ఆ డాన్స్ కు పెద్ద స్థానం ఉంటుంది. ఇదంతా కామన్ అయిపోయింది. సాయిపల్లవి మెస్మరైజ్ చేస్తూ చేసిన మేని విరుపుల కదలికల నృత్యం ఒక సమ్మోహనం. ఆడియో విడుదలైన నాటి నుండి నుంచి ఈ పాట ప్రభంజనంలా వీస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ యూట్యూబ్‌ లో వేగంగా, అత్యధిక వ్యూస్‌ రాబట్టి - ఆ జాబితాలో ఉన్న అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానెల్లో ఈ పాట 173 మిలియన్ల వ్యూస్‌ ను సాధించి తెలుగు పాటను దక్షినాదిన హిమోన్నతానికి చేర్చింది. దీంతో తెలుగు వారంతా గర్వపడే సందర్భం ఇదంటూ.. చిత్ర యూనిట్‌‌పై నెటిజన్లు అభినందనల జడివాన కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: