ఎన్టీఆర్ బయోపిక్ పై చాలా ఉత్కంఠ నెలకొంది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా పేరొందిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన బహుముఖ పాత్ర పోషించారు. అయితే ఆయన మలిదశలో ఎంటరైన లక్ష్మీపార్వతికి ఈ సినిమాలో స్థానం దక్కిందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం.

Image result for ntr biopic

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ఎన్టీఆయ్ కథానాయకుడు సినిమా ఈనెల 9వ తేదీ రిలీజ్ అవుతోంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చే నెల రెండో వారంలో రిలీజ్ అవబోతోంది. కేవలం 83 రోజుల్లోనే దర్శకుడు క్రిష్ ఈ రెండు సినిమాలను పూర్తి చేయడం ఓ రికార్డ్ గా చెప్తున్నారు. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాపై తెలుగువాళ్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుడు సెన్సేషన్ అయితే .. ఆయనే ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అలాంటి మహానుభావుడి జీవితం సినిమాగా వస్తుండడం ఈ తరానికి చాలా ఆసక్తి కలిగిస్తోంది.

Image result for ntr biopic

ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఆయన సినీ జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకూ మొదటి భాగంలో రూపొందించినట్టు సమాచారం. సినిమాల్లో ఆయన పాత్రలు, కుటుంబం, పిల్లలు.. లాంటి అనేక అంశాలు ఫస్ట్ పార్ట్ లో చూడబోతున్నాం.. సినిమాలకు స్వస్తి చెప్పి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి నిర్ణయించడం.., వెంటనే పార్టీ పెట్టడంతో ఫస్ట్ పార్టీ ముగియనున్నట్టు తెలుస్తోంది.

Image result for ntr biopic

ఇక రెండో భాగంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో ఎన్నికలు ఎదుర్కోవడం, వెంటనే 1984 ఆగస్టులో సంక్షోభాన్ని ఎదుర్కోవడం తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పదవీచ్యుతుడైన తర్వాత వెంటనే అసెంబ్లీని రద్దు చేయడం ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అల్లుడు చంద్రబాబు సంక్షోభాన్ని చక్కదిద్దిన తీరు, నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలు కూడా ఇక్కడే రాబోతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన తర్వాత మళ్లీ నెగ్గి పాలనా పగ్గాలు చేపట్టడం, బసవతారకం కన్నుమూయడం వరకూ ఈ భాగంలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అంతటితోనే ఈ సినిమాను అంతమొందించినట్టు సమాచారం.

Image result for ntr biopic

ఒకవేళ ఆ తర్వాత కూడా సినిమా రూపొందిస్తే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి ప్రవేశం, ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దెదించడం లాంటి అంశాలను కూడా చిత్రీకరించాల్సి ఉంటుంది. అందుకే ఎన్నికల ముందు ఆ అంశాల జోలికి వెళ్లకుండా 1985 వరకూ జరిగిన పరిణామాలను మాత్రమే చిత్రీకరించి, బసవతారకం మృతితో రెండోభాగాన్ని క్లోజ్ చేసినట్లు చిత్రవర్గాలు చెప్తున్న మాట. ముఖ్యంగా లక్ష్మిపార్వతితో పెళ్లి, 1995 సంక్షోభం, ఎన్టీఆర్ మరణం లాంటి అంశాల జోలికి వెళ్లకూడదని ఆయన కుటుంబసభ్యులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే 1985తోనే ఎన్టీఆర్ బయోపిక్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: