తన తండ్రి బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ టాక్ సినిమా కొన్న బయ్యర్లను సంతోషంలో ముంచెత్తేలా చేస్తుంది. బయోపిక్ సినిమాలకు క్రేజ్ తెచ్చిన మాహనటి సినిమాను మించి ఎన్.టి.ఆర్ బయోపిక్ ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారట.  


ఎన్.టి.ఆర్ మరో మహానటి అన్నట్టుగా వారు కామెంట్ చేశారట. అయితే ఇది కేవలం మొదటి పార్ట్ సినిమాలో ఎన్.టి.ఆర్ బాల్యం, సిని రంగ ప్రవేశం లాంటివి ఉంటాయి. ఎన్.టి.ఆర్ కథానాయకుడుకి వచ్చిన సెన్సార్ రివ్యూ బయ్యర్లను రిలాక్స్ అవుతున్నారు. అంతేకాదు సినిమా అనుకున్న అంచనాలను అందుకోకుంటే 2 కోట్ల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా కాంట్రాక్ట్ చేసుకున్నారట,


ఎన్.టి.ఆర్ కథానాయకుడు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుందని తెలుస్తుంది. ఆంధ్రాలో 30 కోట్లు బిజినెస్ చేయగా.. నైజాం లో 16 కోట్లు, సీడెడ్ లో 12 కోట్లు.. ఓవర్సీస్ లో 20 కోట్లు ఇలా మొత్తంగా రెండు పార్టులకు కలిపి పెట్టిన బడ్జెట్ అంతా మొదటి పార్ట్ కే వచ్చేసింది. ఎన్.టి.ఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ అదిరిపోయింది.


క్రిష్, బాలకృష్ణ ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా తీశారని తెలుస్తుంది. సెన్సార్ నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఎన్.టి.ఆర్ మరో మహానటి అవుతుందో లేక మహానటిని మించి వెళ్తుందో చూడాలి. సినిమాలో బాలకృష్ణ 60 గెటప్పులలో కనిపిస్తారట. సినిమా చూతున్నంత సేపు పెద్దాయన్ను చూస్తున్న భావనే కలుగుతుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: