ఈనెల 9వ తారీఖున కమెడియన్ అలీ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఈమధ్య అలీ జగన్ ను ఎయిర్ పోర్ట్ లో కలిసిన సందర్భానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అలీ పవన్ కు హ్యాండ్ ఇవ్వబోతున్నాడు అంటూ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చాయి. 
పవన్ సన్నిహితుడు అలీ వైసీపీలో చేరడమా?
అందరికీ షాక్ ఇస్తూ అలీ ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ను అమరావతిలో కలిసి రెండు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు వీరిద్దరి భేటీలో అలీ ఈమధ్య జగన్ ను ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న విషయాలు కూడ ప్రస్తావనకు వచ్చినట్లు టాక్. 
వైసీపీలో చేరుతారని ప్రచారం
అయితే అలీ తన పై వచ్చిన వార్తలు అంతా మీడియా సృష్టి అనీ తాను కేవలం మర్యాదకోసం జగన్ ను కలిస్తే మీడియా వర్గాలు ఎదో ఊహించుకుని వార్తలు వ్రాసాయి అన్న క్లారిటీ అలీ పవన్ కు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాలతో పాటు అనేక రాజకీయ విషయాలు కూడ వీరిద్దరి చర్చలలో వచ్చినట్లు తెలుస్తోంది. 
జగన్‌ను విమానాశ్రయంలో కలిశారే తప్ప.. వీడని సస్పెన్స్
ఈ సమావేశం ముగిసిన తరువాత బయటకు వచ్చిన అలీని మీడియా వర్గాలు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తాను మరికొద్ది రోజులలో క్లారిటీ ఇస్తానని అప్పటి వరకు వెయిట్ చేయమని కోరినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ తో జరిగిన ఈ సమావేశంలో అలీ రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే విషయమై వీరిద్దరి మధ్యా లోతైన చర్చలు జరిగినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: