మరో నాలుగు రోజులలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1కథానాయకుడు మూవీని ప్రమోట్ చేస్తూ బాలకృష్ణ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఎవరు ఎలాంటి సినిమా అయినా తీయవచ్చని చెపుతూ బయోపిక్స్  తీస్తున్నప్పుడు సదరు వ్యక్తి జీవితానికి సంబంధించిన వ్యక్తులతో అనుమతి తీసుకోవాలని కామెంట్స్ చేసాడు. 

తాను ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఈవిషయాలు అన్ని పాటించి తాను ఈ సినిమాను నిర్మిచిన విషయాన్ని తెలియచేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయడానికి తమ కుటుంబ సభ్యుల అనుమతి వర్మకు అవసరం అన్న సంకేతాలు ఇచ్చాడు బాలయ్య. దీనితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో వర్మకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరాలు రాబోతున్నాయి అన్న సంకేతాలు బాలయ్య ఇచ్చినట్లు అయింది. 

దీనితో ఈవిషయమై రానున్న రోజులలో వర్మ నుండి గట్టి కౌంటర్ వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిప్పిస్తున్నాయి. అయితే అనుమతుల విషయానికి వస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కీలకమైన లక్ష్మిపార్వతి అనుమతులు ఉండాలి కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అనుమతులు ఎందుకు అన్న సందేహాలు ఏర్పడటం సహజం. 

దీనికితోడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఓపెనింగ్ స్వయంగా లక్ష్మిపార్వతి చేసిన నేపధ్యంలో బాలయ్య వ్యూహాత్మక హెచ్చరికలను వర్మ పట్టించుకోకపోవచ్చు అనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో బాలయ్య చేసిన కామెంట్స్ బట్టి రానున్న రోజులలో వర్మ నందమూరి కుటుంబ సభ్యుల మధ్య పెను వివాదాలు చెలరేగే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: