ఒకరిని హీరో చేయడం ఇష్టం లేదు.. మేమే సూపర్ స్టార్స్ అని గతంలో ఓసారి బాలకృష్ణ చేసిన కామెంట్‌ పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారో.. ఆయన మాట్లలోనే వినండి..

nagababu on balayya కోసం చిత్ర ఫలితం

బాలకృష్ణ ఓసారి ఏబీఎన్ ఛానల్లో పవన్ కామెంట్స్ పై స్పందిస్తూ.. మాకు మేమే స్టార్స్.. మేమే స్టార్స్ ను తయారు చేస్తాం అన్నారు.. మీరేనా సినిమా ఇండస్ట్రీలో సూపర్‌ స్టార్స్ ఇంకెవరూ లేరా.. పవన్ కల్యాణ్ ఒకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే.. దాన్ని విమర్శించొచ్చు.. కామెంట్ చేయొచ్చు.

మీరు సూపర్‌ స్టార్సే.. కానీ మీరు మాత్రమే సూపర్ స్టార్లా.. పవన్ కల్యాణ్‌ కాదా.. అసలు ఈ టైప్ ఆఫ్ కామెంట్‌ ఏంటి.. దీనిపై మేం కామెంట్‌ చేయలేమా.. చేతకాదా.. అయినా చాలా కాలం వెయిట్ చేశాం. సినిమా ఇండస్ట్రీల్లో మీరు, మీకు సంబంధించిన వారు మాత్రమే స్టార్లు కాదు.

సంబంధిత చిత్రం

పేరున్న ప్రతి ఒక్కరూ స్టారే.. పవన్ అనే మెగా స్టార్.. మహేశ్ బాబు స్టార్.. జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టారే.. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఉన్నారు.. చాలా మంది ఉన్నారు. మీకు స్టార్ అని చెప్పుకోండి.. తప్పులేదు.. ఎవరినో హీరోను చేయడం ఎందుకు అని మీరు అన్నారు.. అసలు మీరు ఎవరిని హీరోను చేస్తారు.. జనాలు హీరోలను చేస్తారు. జనాలు మెచ్చుకుంటే స్టార్లవుతారు..

సంబంధిత చిత్రం

అయితే ఈ నాగబాబు పోరాటం ఇప్పట్లో ఆగేలా లేదు. బాలయ్యపై ఆయన సుదీర్ఘమైన వార్‌కు రెడీ అయ్యారనే చెప్పాలి. రోజుకో కామెంట్ చొప్పున ఆయన సోషల్ మీడియాలో వదులుతున్నారు. మరి దీనిపై బాలయ్య క్యాంప్ ఏమైనా స్పందిస్తుందా.. స్పందిస్తే ఎలా కౌంటర్‌ ఇస్తుంది.. అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: