కోలీవుడ్ స్టార్స్ సైతం షాక్ అయ్యేలా నయనతార సినిమాలు ఉంటాయి. ప్రతి సినిమా ఓ కొత్త ప్రయత్నంగా నయన్ చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. త్వరలోనే నయనతార ఐరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే నయనతార సీక్రెట్ ను ఇప్పుడిప్పుడే కనిపెట్టిన మిగతా తారామణులు ఆమె చేసే సినిమాల వైపు అడుగులేస్తున్నారు. 


అందులో భాగంగా కాజల్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. అది కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ రీమేక్ గా కాజల్ తమిళంలో ప్యారిస్ ప్యారిస్ సినిమా చేస్తుంది. ఈ సినిమాను రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో సీన్ కాస్త ఘాటుగా ఉండటం వల్ల కాజల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.


కాజల్ పర్మిషన్ తోనే అలా చేశారా అన్న డౌట్ కూడా వచ్చింది. ఏది ఏమైనా కాజల్ చేసిన ఈ క్రేజీ అటెంప్ట్ తో కోలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఎంతగా అంటే ఏకంగా నయనతారని మించేలా కాజల్ క్రేజ్ ఉంది. అదెలా అంటే నయనతార కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా నిలవడమే కాకుండా టీజర్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన కోలమావు కోకిల టీజర్ రికార్డ్ బ్రేక్ చేసింది కాజల్ ప్యారిస్ ప్యారిస్.


ఆ సినిమా 6 మిలియన్ వ్యూస్ రాబట్టగా ప్యారిస్ ప్యారిస్ 7 మిలియన్ వ్యూస్ సాధించింది. సో కాన్సెంట్రేట్ చేస్తే కాజల్ కూడా ఫీమేల్ లీడ్ సినిమాలతో కోలీవుడ్ లో సత్తా చాటేలా ఉందని అంటున్నారు. మరి నయన్ సినిమాల్లానే కాజల్ ప్యారిస్ ప్యారిస్ హిట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: