నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తున్న మెగా బ్రదర్‌ నాగబాబు.. తన జోరు మరింత పెంచారు. రోజూ.. ఉదయం, సాయంత్రం యూట్యూబ్ ద్వారా బాలయ్య కామెంట్లకు రిప్లయ్‌ ఇస్తూ కలకలం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్‌లో నందమూరి బ్లడ్, బ్రీడ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

balakrishna vs nagababu కోసం చిత్ర ఫలితం

మా బ్లడ్లే వేరు.. మా బ్రీడే వేరు.. అని గతంలో బాలయ్య అన్న కామెంట్లను కోట్ చేస్తూ.. ఆ భాషేంటి అంటూ మండపడ్డారు. మా బ్లడ్, బ్రీడ్‌ వేరు అంటే మీరేమైనా దిగొచ్చారా.. లేక మీరేమైనా దైవాంశసంభూతులా అంటూ ప్రశ్నించారు. మీరు మనుషులే అని గుర్తు చేశారుమీరు మీ తల్లిదండ్రులకు పుట్టినవారే అన్నారు.

సంబంధిత చిత్రం

గతంలో అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవిలను కూడా వాళ్లేం పెద్ద స్టార్లు అంటూ బాలయ్య విమర్శించాడంటూ నాగబాబు గుర్తు చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌ ఎంత పెద్ద స్టారో.. హిందీలో అమితాబ్‌, కన్నడలో రాజ్‌కుమార్, తమిళంలో ఎంజీఆర్ అంత పెద్ద స్టార్లే అని నాగబాబు అంటున్నారు.

balakrishna on blood and breed కోసం చిత్ర ఫలితం

ఇలా మా బ్లడ్లే అని యూరప్‌లో చెప్పుకున్న రాజరిక కుటుంబాలను అక్కడి జనాలు తొక్కిపెట్టారని నాగబాబు చెప్పారు. మిగిలిన వారిని తక్కువ చేసే, చులకన చేసే.. ఇలాంటి రాజరిక ఆలోచనలు మానుకోవాలన్నారు. ఒక్కోసారి తాము ఫెయిలై ఉండొచ్చు.. ఒక్కోసారి సక్సస్ అయ్యి ఉండొచ్చు.. గెలుపోటములు సర్వసాధారణం అన్నారు నాగబాబు..


మరింత సమాచారం తెలుసుకోండి: