సాయిపల్లవి.. అందానికి అందం.. నటనకు నటన.. ఈమె ప్రత్యేకత. క్రేజ్ ఉంది కదా అని వచ్చిన సినిమాలన్నీ చేసుకోకుండా.. సెలెక్టివ్‌ గా నటిస్తుంది సాయిపల్లవి. ఈ సెలక్షన్‌తోనే కాస్త పొగరెక్కువ అన్న పేరు కూడా సంపాదించుకుంది.

saipallavi photos కోసం చిత్ర ఫలితం

వైద్యవృత్తి వదిలేసి మరీ సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది తనకు నటన, ఆ నటనలో శాటిస్‌ఫాక్షన్‌ ఇంపార్టెంట్ అంటోంది. సాయిపల్లవికి మరో ప్రత్యేకత ఉంది. ఈమె వ్యాపార ప్రకటనల్లో అస్సలు కనిపించదు. తనకు యాడ్స్ లో కనిపించడమంటే అస్సలు ఇష్టం ఉండదట.

సంబంధిత చిత్రం

సినిమాల్లో నటించడమే తనకు ఇష్టం అంటోందీ సాయిపల్లవి. తనకున్న పేరు గుర్తింపు సేవా కార్యక్రమాలకు ఉపయోగపడితే చాలట. అంతకు మించి తనకు కోట్లు కూడబెట్టుకోవాలన్నఆశలేమీ లేవట. వైద్యవృత్తిని వదిలేసినందుకు పెద్దగా బాధడపడటం లేదంటోందీ చిన్నది.

saipallavi photos కోసం చిత్ర ఫలితం

అందరికీ వినోదం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని.. తన పేరేంట్స్ కూడా తన నటన పట్ల సంతృప్తిగా ఉన్నప్పుడే తనకు సంతోషంగా ఉంటుందంటోంది. పడిపడి లేచె మనసు.. సినిమా చూసిన తర్వాత తన తల్లి.. తాను నటిగా చాలా మెచ్యూర్ అయ్యావని కాంప్లిమెంట్ ఇచ్చిందని మురిసిపోతోంది సాయిపల్లవి.


మరింత సమాచారం తెలుసుకోండి: