ఈ మద్య సినీ ఇండస్ట్రీలో బడాబాబుల హవా నడుస్తుంది.  ఇక పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే..చిన్న చిత్రాలకు సమస్యలకు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది చిన్న చిత్రాల దర్శక, నిర్మాతలు ఈ విషయాల్లో గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్, ఎఫ్ 2, పెట్టా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇందులో  బాలకృష్ణ 'ఎన్టీఆర్ - కథానాయకుడు', 11న రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదలవుతుండటంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి. 

ఆపై వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్-2' రానుంది.   దీంతో 'పేట'కు థియేటర్లే లభించడం లేదు. రెండు మూడు థియేటర్లు ఉన్న సీ-సెంటర్లలో పేట విడుదలకే నోచుకోని పరిస్థితి.  అయితే 10 నుంచి 15 వరకూ థియేటర్లు ఉన్న పట్టణాల్లో కనీసం ఒక థియేటర్ అయినా దక్కుతుందో లేదో అన్న విషయంపై క్లారిటీ లేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన నిర్మాత  వల్లభనేని అశోక్ స్టార్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చిన్న చిత్రాలను బతకనివ్వడం లేదని, నయీమ్ వంటి గ్యాంగ్ స్టర్ ను ఎన్ కౌంటర్ చేసి చంపిన తెలంగాణ ప్రభుత్వం, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి థియేటర్ మాఫియాను కూడా షూట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్లు అరవింద్, దిల్ రాజులు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వాళ్ల వల్ల చిన్న చిత్రాలు చచ్చిపోతున్నాయని వాపోయారు. థియేటర్ మాఫియాను నడుపుతున్న కుక్కలకు బుద్ధి చెప్పాలని..తమ చిత్రానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: