బోయపాటి సినిమా అంటే హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. అలాంటి దర్శకుడికి అంతే పవర్ ఫుల్ హీరో దొరికితే ఎలా ఉంటుంది ఇక ఆ సినిమా అంచనాలకు ఆకాశమే హద్ధు అనేలా ఉంటుంది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు అలాంటి అద్భుతాన్ని చూపించడానికే వస్తున్నాడు వినయ విధేయ రామ. 


డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమా ఎలా ఉంటుంది అన్నది ట్రైలర్ లోనే చూపించారు. అయితే ట్రైలర్ లో లేని అద్భుతమైన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని అంటున్నారు. ఇక యాక్షన్ పార్ట్ విషయానికొస్తే చరణ్ ఇన్ని సినిమాల్లో చేసిన యాక్షన్, ఫైట్స్ ఒక లెక్క ఈ సినిమా ఒక లెక్క అనేలా ఉంది.


ముఖ్యంగా అజర్ బైజాన్ లో వివేక్ ఓబేరాయ్ తో చేసే ఫైట్ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. ఆ ఫైట్ సీన్ సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుందట. సినిమా రేంజ్ పెంచేలా ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. అంతేకాదు ఆ ఫైట్ మొత్తం మెగా ఫ్యాన్స్ అంతా సీట్లలో కూర్చోవడం కష్టమే అంటున్నారు. అంత పర్ఫెక్ట్ గా పవర్ ప్యాక్డ్ గా ఆ యాక్షన్ పార్ట్ ఉంటుందట.


ట్రైలర్ లో టాటూలతో కనిపించి విధ్వసం ఎలా ఉంటుందో రుచి చూపించిన చరణ్ వెండితెర మీద అసలు సిసలు బొమ్మ చూపిస్తాడని అంటున్నారు. చరణ్, బోయపాటి మార్క్ మూవీగా వస్తున్న వినయ విధేయ రామ రంగస్థలం తర్వాత చరణ్ పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. మరి ఆశించిన స్థాయిలో సినిమా ఉంటుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: