ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ కొనసాగుతుంది.  గత ఏడాది తెలుగు లో మహానటి, బాలీవుడ్ లో సంజు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈ సంవత్సరం వరుసగా బయోపిక్ సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి.   2019లో ఏకంగా 25 బయోపిక్ లు క్యూలైన్ లో ఉన్నాయి.  ఈ సినిమాలు క్రీడలు, రాజకీయాలు, సైన్స్, రియల్ ఇన్సిడెంట్ బేస్ ప్రముఖులపై బయోపిక్‌లు ప్రముఖంగా ఉన్నాయి.  ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు జనవరి 9న, మహానాయకుడు  ఫిబ్రవరి 7న రిలీజవుతున్నాయి.

Image result for ntr biopic yatra

వైయస్సార్ జీవితకథ ఆధారంగా మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న ‘యాత్ర’ మూవీ ఫిబ్రవరి 8న రిలీజవుతోంది.  అంతే కాదు తెలుగులో  కాంతారావు జీవితంపై ‘రాకుమారుడు’ అనే సినిమా తెరకెక్కుతోంది. పీసీ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత జీవితంపై నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ‘ది ఐరన్ లేడి’ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.  ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకుడు, రాజకీయ నాయకుడు ‘ఎంజీఆర్’ పై బయోపిక్ సెట్స్ పై ఉంది.  

Image result for manikarnika tharkre

కంగన రౌనత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక  ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’, నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ పాత్రలో ‘థాక్రే’ ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసుకుని రిలీజ్ సిద్దంగా ఉన్నాయి. అయితే మణికర్ణిక మొదట ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వం వహించారు...ఈ సినిమా సగంలోనే ఆయనకు ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.  ఆ తర్వాత హీరోయిన్ కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది.   ఈ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక  గణితశాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా.. హృతిక్ రోషన్  హీరోగా తెరకెక్కిన ‘సూపర్ 30’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో  హవీల్దార్ ఇషార్ సింగ్ బయోపిక్ ‘కేసరి’ సెట్స్ పై ఉంది.

Image result for shakeela biopic

మాలీవుడ్ శృంగార తార షకీలా జీవితకథ ఆధారంగా రిచా చద్దా టైటిల్ పాత్రలో ఇంద్రజిత్ లంకేష్  తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఐఏఎఫ్ పైలెట్  గుంజన్ సక్సేనా జీవితకథ ఆధారంగా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో ధర్మ ప్రొడక్షన్స్ ఓ భారీ సినిమా తెరకెక్కించనుంది. స్పేస్‌లో ప్రయాణించిన తొలి సైంటిస్ట్ రాకేశ్ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘సారే జహాసె అచ్చా’ త్వరలో రాబోతుంది. రాకేష్ శర్మ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

Image result for modi biopic

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబేరాయ్ నటించనున్నారని ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా 2019 లో బయోపిక్ సినిమాలతో సందడి చేయబోతున్నారు..మరి ఈ సినిమాలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాయా..లేదా అన్న విషయం ముందు ముందు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: