తెలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ చాలా ముఖ్యం. దాని కోసమే ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ఇలా ఎన్ని చేయాలో అన్నీ చేస్తూంటారు. పైగా సినిమా వారికి సెంటిమెంట్లు కూడా ఎక్కువ. ఓ సినిమా హిట్ కావడానికి ఎన్ని తంటాలు పడాలో అన్నీ పడతారు. అటువంటిది పెద్ద పండుగ వేళ విడుదల అవుతున్న ఎన్టీఆర్ కధానాయకుడు మూవీకి ఇపుడు మెగా గండం పొంచిఉందంటున్నారు. ఓ వైపు చిత్రానికి పాజిటివ్ బజ్ కోసం ఫిల్మ్ మేకర్లు చూస్తూంటే ఇంకో వైపు నెగిటివ్ ఎక్కువైపోతోంది.


బాలక్రిష్ణ వర్సేస్ నాగబాబు ఎపిసోడ్  ఇపుడు ఎన్టీఆర్ కధానాయకుడు బయ్యర్లను తెగ కలవరపెడుతోందట. నలభయి ఎనిమిది గంటల్లో బొమ్మ తెరపైకి వస్తున్న వేళ బాలక్రిష్ణ మీద నాగబాబు విరుచుకుపడుతూ వరసగా పెడుతున్న కామెంట్స్ ఇపుడు బయ్యర్లలో ఎక్కడ లేని కంగారును పుట్టిస్తున్నాయట. వెన్నుపోటు తండ్రి ఎన్టీఆర్ కి జరిగితే బాలయ్య బ్లడ్, బ్రీడ్ ఏమయ్యాయంటూ నాగబాబు సూటిగా ప్రశ్నించడం ఆడియన్స్ మీద పడి నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తుందా అన్న భయం పట్టుకుందట. ఇక బాలయ్య గతంలో చేసిన  కామెంట్స్ ని పెట్టడం ద్వారా కొన్ని సెక్షన్లో ఆగ్రహం పెంచడం కూడా నాగబాబు చేస్తున్నారని, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమని అంటున్నారు.


నిజానికి ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రానికి మంచి టాక్ ఉంది. చిత్రాన్ని సెన్సార్ చేసిన వారు సైతం బాగుందని చెప్పడంతో బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. ఇపుడు నాగబాబు రూపంలో నెగిటివ్ ప్రచారం ఊపందుకోవడం, ఎక్కడా తగ్గకుండా నాగబాబు వరస పెట్టి కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియా ద్వారా బాలయ్యతో చెడుగుడు ఆడుతోండడంతో ఈ సినిమా పై ఎలాంటి ప్రతికూలత పడుతోందోనని నందమూరి ఫ్యాన్స్ సైతం బెంబీఅలెత్తుతున్నారట


మరి నాగబాబు ఏమో ఆపడం లేదు. బాలయ్య సైతం ఇది పట్టించుకోకుండా  సినిమా ప్రమోషన్ల కోసం తిరుగుతున్నారు. కానీ సినిమాను ఫ్యాన్సీ రేటు పెట్టి కొన్న బయ్యర్లు మాత్రం తేడా కొడితే మునిగిపోతామేమోనని హడలిపోతున్నారుట. ఈ మొత్తం ఎపిసోడ్ లో రిలీఫ్ ఏంటంటే మెగా వారసుడు రాం చరణ్ ఎన్టీఆర్ కధానాయకుడు మూవీ పై పాజిటివ్ గా మాట్లాడడం, ఆ మూవీ కోసం తాను కూడా వైటింగ్ అంటూ చెర్రీ చేసిన కామెంట్స్ ఇపుడు నెగిటివ్ ప్రచారాన్ని బ్యాలన్స్ చేయాలేమో



మరింత సమాచారం తెలుసుకోండి: