హిందీ లో మొదలైన బిగ్ బాస్  రియాల్టీ షో తర్వాత అన్ని బాషల్లో పాపులారిటీ సంపాదించడం మొదలు పెట్టింది.  బిగ్ బాస్ రియాల్టీ షో  మంచి  టీఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతుంది.   హిందీ లో సల్మాన్ ఖాన్ ఏకంగా 12 సిజన్స్ కి హోస్ట్ గా షురు అయితే తమిళనాట కమల్ హసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  తెలుగు లో  మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదట్లో ఎన్టీఆర్ హోస్టింగ్ పైన యాంకరింగ్ పైన నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు కాని రెండు ఎపిసోడ్స్ పూర్తీ చేసుకున్నాక తరువాత ఎన్టీఆర్ యాంకరింగ్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఫిదా అయిపోయారు.

Image result for big boss ntr

అతని యాంకరింగ్ పై ప్రముఖులు సైతం ప్రసంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో షో ని ఎక్కడికో తీసుకుపోయాడు, టెలివిన్ సెట్ పై నెంబర్ వన్ టీఆర్ పీ తో దూసుకుపోయాడు మిగిలిన షోస్ నీ వెనక్కి నేట్టేసాడు ఎన్టీఆర్. ఇక రెండో సీజన్ కి మాత్రం ఎన్టీఆర్ సినిమాలతో బిజీ గా ఉండడంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని సీజన్ 2 కి హోస్ట్ గా నిర్ణయించుకున్నారు. నాని యాంకరింగ్ పై మొదట్లో హైప్ వచ్చిన తరువాత నాని పై మరింత నేగేటివిటి ఏర్పడింది నాని పై ట్రోల్స్ మొదలయ్యాయి, ఆ ఎఫెక్ట్ నాని సినిమాపై బాగానే పడింది దాంతో నాని నెస్ట్ సీజన్ కి హోస్ట్ గా చెయ్యానని చెప్పినట్లు సమాచారం. 

Related image

ఈ మూడో సీజన్ కు హోస్ట్ గా సీనియర్  వెంకటేష్ అనుకుంటున్నారు, ఇంకా ఫైనల్ మాత్రం కాలేదు . అయితే హోస్ట్ డిసైడ్ కాలేదు కానీ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేసేది వీళ్ళే అంటూ ఓ లిస్ట్ మాత్రం వస్తోంది. తాజాగా మూడవ సీజన్ కంటేస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్టు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ లీస్టులో ఉన్న వారు నిజంగా ఇంటి సభ్యులుగా ఉంటారా..అంతా రూమర్లా అన్న విషయం త్వరలో తెలియనుంది.  ఆ మద్య   బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల పేరు కూడా వినిపించింది అయితే నేను బిగ్ బాస్ 3 లో పాల్గొనడం లేదు అని ఖండించింది. అయితే  బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తే ఈ సారి రియాల్టీ షో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.  ఇక బిగ్ బాస్ 2వ సీజన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగడం వల్ల చాలా విషయాలు ముందే లీక్ అవ్వడం.... నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ సారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట.  

1) జాహ్నవి

2) వెబ్ మీడియా జ్యోతి

3) శోభిత ధూళిపాళ

4) జబర్దస్త్ పొట్టి గణేష్

5) ఉదయభాను

6) జాకీ టివి ఆర్టిస్ట్

7) వరుణ్ సందేశ్

8) రేణు దేశాయ్

9) చైతన్య కృష్ణ

10) మనోజ్ నందన్

11) కమల్ కామరాజు

12) నాగ పద్మిని

13) రఘు మాస్టర్

14) హేమ చంద్ర

15 ) గద్దె సింధూర 

మరింత సమాచారం తెలుసుకోండి: