ఉమ్ముడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజా సంక్షేమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పవర్ ఫుల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు వైస్సార్.  ఆ సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారని..వారిని ఆదుకోవడం తన బాధ్యత అంటూ ఊరూరా పాదయాత్ర చేశారు.  పేద ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చారు..దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టం కట్టారు.  ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఆయన ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 

అందులో ముఖ్యమైనది 108, ఆరోగ్యశ్రీ,పేదలకు ఫీజ్ రియాంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.  ఇక వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, లిరిక్స్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.  తాజాగా ‘యాత్ర’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. నా విధేయతను విశ్వసాన్ని బలహీనతగా తీసుకొవద్దంటూ మమ్ముట్టి చెప్పిన డైలాగ్‌తో మొదలైంది.. నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ..ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోలేకపోయాం అంటూ ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి.

మనిషికి పేదరికమే పెద్ద సమస్య పేదరికానికి మించిన శిక్ష లేదంటూ డైలాగులు రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.  ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మమ్ముట్టి పోషించగా జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.జయ్ చిల్ల మరియు శశి దేవి రెడ్డి ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: