సినిమాల్లో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు అవి చాలదు అన్నట్టు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీటితో పాటుగా వచ్చిన రెమ్యునరేషన్ తో ఏదో ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా సొంత బిజినెస్ లు మొదలుపెట్టారు. అయితే వారిలో కొత్తగా సూపర్ స్టార్ మహేష్ ఈమధ్యనే ఏ.ఎం.బి సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ బిజినెస్ లో అడుగుపెట్టాడు. 


ఏసియన్ సినిమాస్ సునీల్ తో కలిసి మహేష్ ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈమధ్యనే సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదగా ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ అయ్యింది. ఇంద్రభవనం లాంటి ఈ మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులను మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా 3డి సౌండ్ టెక్నాలజీని ఫిక్స్ చేశారు. మహేష్ మల్టీప్లెక్స్ క్లిక్ అవడంతో అదే దారిలో అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో భారీ మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట.


ఇదిలాఉంటే యంగ్ రెబల్ స్టార్ పభాస్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నాడని లేటెస్ట్ న్యూస్. నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రభాస్ మల్టీప్లెక్స్ ఉంటుందని తెలుస్తుంది. నెల్లూరు జిల్లాల్లో సూళ్లూరుపేట జాతీయ రహదారి మీద ప్రభాస్ మల్టీపెక్స్ నిర్మిస్తున్నాడట. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ లో 7 థియేటర్స్ ఉంటాయని తెలుస్తుంది. ఒక్కో థియేటర్ లో 170 సీటింగ్ కెపాసిటీ ఉంటుందట. 3డి కి అనుగుణంగా ఉండే సౌండ్ టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్ ఉంటుందట. 106 అడుగుల స్క్రీన్ తో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారట. 


దేశంలో ఇంత భారీ స్థాయిలో ఉన్న స్క్రీన్స్ లేవని చెప్పాలి. దీని నిర్మాణానికి 40 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారట. ప్రభాస్ తో పాటుగా యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ లు ఈ మల్టీప్లెక్స్ లో భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. మరి ప్రభాస్ దిగుతున్న ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: