గతసంవత్సరం ఒక్క  అల్లుఅర్జున్ కు తప్ప  అందరు టాప్ హీరోలకు హిట్స్ ఉన్న నేపధ్యంలో ఈసారి త్రివిక్రమ్ తో చేయబోతున్న మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలి అనే పట్టుదల పై ఉన్నాడు. దాదాపు ఆరు నెలల నుంచి మంచికథ కోసం వెయిట్ చేస్తూ మధ్యలో విక్రమ్ కుమార్ పరశురామ్ లాంటి పేర్లు విన్పించినా ఫైనల్ గా త్రివిక్రమ్ కు ఓటువేసిన అల్లు అర్జున్ ఆలోచనలు ఏకంగా మెగా కాంపౌండ్ కు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారంమేరకు త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో ప్రారంభంకాబోతున్న మూవీని   ఫిబ్రవరి 14న ‘వేలంటైన్స్ డే’  రోజున లాంచ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో మూవీ స్టార్ట్ చేసి దసరా నాటికి రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ తో అదేరోజు ఈమూవీ రిలీజ్ డేట్ ను కూడ ప్రకటిస్తారని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే మెగా కాంపౌండ్ నిర్మిస్తున్న ‘సైరా’ కు మరో ఊహించని షాక్ అనుకోవాలి. 

వాస్తవానికి ‘సైరా’ నిర్మాణం ఇంకా పూర్తి అవ్వకపోవడంతో ఈమూవీని సమ్మర్ రిలీజ్ నుండి తప్పించి ఆగష్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే ఆ డేట్ ను ప్రభాస్ ‘సాహో’ అధికారికంగా బ్లాక్ చేసిన పరిస్థుతులలో అన్నీ కుదిరితే ‘సైరా’ దసరాకు విడుదల చేయాలి అనే ప్లాన్ లో ప్రస్తుతానికి మెగా కాంపౌండ్ ఉంది. అయితే ‘సైరా’ విషయం తేలకుండానే ఇప్పుడు బన్నీ తన లేటెస్ట్ సినిమాను దసరా రేసుకు రెడీ చేస్తున్న నేపధ్యంలో చిరంజీవి ‘సైరా’ కు వచ్చే సంవత్సరం సంక్రాంతి మాత్రమే మిగిలి ఉంది అన్నకామెంట్స్ వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ బన్నీల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీ కథ పదేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఇన్వెన్షన్ ఆఫ్ లైయింగ్’ అనే సినిమా స్ఫూర్తితో స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు త్రివిక్రమ్ ఎప్పుడూ ఉపయోగించే తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో ఈకథ నడుస్తుందని అంటున్నారు. దీనితో త్రివిక్రమ్ ఈసారి కూడ ఇంగ్లీష్ సినిమాను కాపీ కొట్టి బన్నీ కోసం కథ అల్లుతున్నాడా అంటూ అప్పుడే ఈసినిమా ప్రారంభం అవ్వకుండానే త్రివిక్రమ్ పై సెటైర్లు మొదలైపోయాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: