ఈ సంవత్సరం వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యాల్లో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ప్రస్తుతం తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ జీవిత కథ నేపథ్యంలో యాత్ర సినిమాలు రాబోతున్నాయి.  త్వరలో కాంతారావు,  జయలలిత, ఎంజీఆర్, అబ్దుల్ కలాం, బాల్ థాక్రే ఇలా పలువురి బయోపిక్ లు రాబోతున్నాయి. 

ఈ క్రమంలోనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి బాలీవుడ్లో సన్నాహాలు మొదలైపోయాయి.  ఒక సామాన్యమైన టి వాలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి..దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యాడు..ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టాలు ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. నరేంద్ర మోదీ బాల్యం, విద్యాభ్యాసం,రాజకీయ ప్రవేశం,అంచలంచెలుగా ఎదిగిన తీరు ఈ బయోపిక్ లో చూపించనున్నారు.  ఈ ఫస్టులుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్ చేశారు.

నరేంద్ర మోదీ లుక్ లో వివేక్ ఒబెరాయ్ బాగా కుదిరిపోయాడు. సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఓ వైపు జాతీయ జెండా రెపరెపలాడుతోండగా..మరోవైపు ప్రజలు కనిపిస్తున్నారు. పీఎం నరేంద్రమోదీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.   ఈ మూవీలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: