సినిమాలకు దూరంగా ఉంటూ ‘జనసేన’ ద్వారా త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ అయోమయం ఇప్పుడు సినిమా మరియు రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రజా పోరాట యాత్రతో పవన్ గత కొన్ని నెలలుగా జనం మధ్య తిరుగుతూ ఉన్నా రాబోతున్న ఎన్నికలలో అతదికిపడే ఓట్ల శాతం ఎట్టి పరిస్థులలోను 8శాతం మించదు అంటూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వ్ పవన్ కు కలవరపాటు కలిగిస్తున్నట్లు సమాచారం. 

రాబోతున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కర్నాటక ఎన్నికల మాదిరిగా పరిస్థుతులు ఏర్పడి తక్కువ సీట్లు వచ్చినా అధికారం చేపట్టవచ్చని కలలు కన్న పవన్ కలలు వాస్తవం అయ్యే పరిస్థుతులు కనిపించకపోవడంతో రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ ఓడిపోతే తన ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందని పవన్ లోలోపల మధన పడుతున్నట్లు టాక్. ఎన్నికల తరువాత తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలు చేసినా గ్యారెంటీగా హిట్స్ వస్తాయి అన్న నమ్మకం వ్యక్తిగతంగా పవన్ కు కూడ లేదు అని అం అంటున్నారు.
Pawan Kalyan Porata Yatra Breaks again Because Of Security Reason
పవన్ సన్నిహితులు కొందరు ముఖ్యంగా పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక జ్యోతిష్కుడు ‘జనసేన’ పార్టీని రాబోతున్న 2019 ఎన్నికలలో పోటీలోకి దింపడం కంటే పవన్ కు జాతక రీత్యా కలిసి వచ్చేకాలం ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి 2024 ఎన్నికల వరకు వేచి ఉంటే మంచిది అని ఇచ్చిన ఒక సలహా పవన్ ను మరింత గందరగోళంలో పడేస్తోంది అని అంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ‘జనసేన్’ ను వెంటాడుతున్న నిధుల కొరత కూడ పవన్ కు టెన్షన్ పెడుతున్నట్లు టాక్.
ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య పవన్ ‘జనసేన’ నిధుల సమీకరణ కోసం అమెరికాకు వెళ్లి అతడి అభిమానులతో సమావేశాలు పెడితే ఆ సమావేశాలకు వచ్చిన అభిమానులు చాలామంది వందల డాలర్ల మొత్తంలో విరాళాలు ఇచ్చారు కానీ ఏఒక్క అభిమాని చెప్పుకోతగ్గ స్థాయిలో ‘జనసేన’ కు విరాళాలు ఇవ్వకపోవడం పవన్ ను మరింత ఆశ్చర్య పరిచినట్లు టాక్. 
పవన్ పోరాట యాత్ర షెడ్యూల్ 
గత సంవత్సరం కమలహాస’న్ తన రాజకీయ పార్టీ కోసం తన అభిమానులకు పిలుపును ఇస్తే ఓవర్సీస్ లోని కమల్ అభిమానులు సుమారు 30 కోట్ల వరకు విరాళాలు ఇచ్చినట్లు తమిళ మీడియా వార్తలలో వచ్చింది. అయితే కనీసం పవన్ కళ్యాణ్ ను దేవుడుగా ఆరాధించే పవన్ అభిమానులు కమలహాసన్ అభిమానుల స్థాయిలో కూడా స్పందించకపోవడం పవన్ ను ఆశ్చర్య పరిచినట్లు సమాచారం. అయితే ఈ వ్యతిరేక పరిస్థితులను లెక్క చేయకుండా రానున్న ఎన్నికలలో అన్ని స్థానాలు పోటీ చేస్తాను అంటూ ప్రకటనలు ఇస్తూ తలలు పండిన రాజకీయ వేత్తలకు కూడా షాక్ ఇస్తున్నాడు. పవన్ ‘జనసేన’ కు అధికారంలోకి వచ్చే స్థాయి లేకపోయినా అధికారంలోకి రావాలని ఆరాట పడుతున్న చంద్రబాబు జగన్ ల రాజకీయ భవిష్యత్ ను శాసించే కీలక శక్తిగా మారిన విషయం మటుకు పవన్ వ్యతిరేకులు కూడ అంగీకరిస్తున్న నిజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: