బాలక్రిష్ణ స్పీడున్న హీరో. ఇండస్ట్రీకి వచ్చి నలభయి ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ హీరో వందకు పైగా సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇక హీరోగా బాలయ్య ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. అదే విధంగా జానపద, చారిత్రాత్మక, పౌరాణిక చిత్రాల్లో నటించి తనకు తానే సాటి అని వర్తమాన సినిమా యుగంలో రుజువు చేసుకున్నారు. 


అన్నింటికీ మించి బాలయ్య సినిమాలు వేగంగా చేస్తారు. అంకితభావంతో చేస్తారు. ఆ విషయంలో యూత్ హీరోలు ఆయన్ని ఓ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇప్పటి హీరోలతో పోటీ పడుతూ అయన ఇంకా కొత్త సినిమాలు చేయాలని వువ్విళ్ళూరుతున్న తీరు నిజంగా గొప్ప విషయం. ఇక బాలయ్య తన తండ్రి పాత్రలో తాను నటించి నిర్మించిన చిత్రం ఎంటీయార్ కధానాయకుడు రేపు రిలీజ్ అవబోతోంది. ఆ సినిమా కూడా ఓ విధంగా ప్రయోగం, సాహసమే. నిన్నటి వరకూ కళ్ళ ముందు కదలాడిన ఓ మహోన్నత వ్యక్తి గురించి సినిమా తీయడం, అందులో నటించి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. కానీ బాలయ్య దాన్ని సుసాధ్యం చేయాలనుకుంటున్నారు.


ఇకపోతే తన చిత్రం ప్రమోషన్లో భాగంగా బాలయ్య బెంగులూర్ వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ చాన్స్ వస్తే కన్నడ చిత్రంలో నటించి మెప్పిస్తానని చెప్పుకొచ్చారు. కన్నడ కంఠీరవ డాక్టర్ విజయకుమార్ సినిమా కూడా తెరపైకి రావాలని ఆకాంక్షించారు. దక్షిణాది సినిమాలు ఇపుడు ఉత్తరాదిని మించి ఆడుతున్నాయని, ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయని బాలయ్య చెప్పడం విశేషం. మొత్తానికి బాలయ్య కన్నడ సినిమా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: