తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తున్నా వర్మ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.  ఇటీవల కుట్ర కుట్ర అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 
Related image
ఈ సాంగ్ లో ఏపి సీఎం చంద్రబాబు ను విమర్శిస్తున్నట్లుందని ఆ పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు.  ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం, వ్యక్తిగత జీవితంలో లక్ష్మీ పార్వతి పాత్రను ప్రధానంగా ఇందులో చూపుతామని అన్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎందుకు’టీజర్ ని విడుదల చేశారు. 
Image result for laxmis ntr
అయితే ఎన్టీఆర్ నట జీవితంలో ఎంతో మంది అందమైన సినీ తారలతో నటించారు.  ఈ నేపథ్యంలో జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?’ అంటూ సాగే పాట టీజర్ ను వర్మ ఈరోజు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి పాటను  విడుదల చేస్తామని ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: