అవి యమగోల్ రిలీజ్ అయిన రోజులు. అప్పట్లో ఓ పాట ప్రతీ గల్లీలో మారుమోగిపోయేది. . అందులో అన్ని పాటలు మాస్ కి కిక్కేంకించేవే. కానీ అందులో సెకండాఫ్ లో వచ్చే చిలక్కొట్టుడు కొడితే చిన్న దానా పాట సూపర్ డూపర్ హిట్ ఈ పాట సినిమాను నిలబెట్టేసిందని అనే వారూ ఉన్నారు. ఎన్టీఆర్ జయప్రద తో చేసిన డ్యాన్సులు, ఆ స్పీడ్, దూకుడు అప్పటి యూత్ ని కిర్రాకు పెట్టించాయి.


మళ్ళీ ఆనాటి సాంగ్ ఇపుడు మారు మోగబోతోంది. అది ఎన్టీఆర్ కధానాయకుడు మూవీలో. ఇందులో ఎన్టీఆర్ నట జీవితాన్ని బాగా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అన్న గారిగా బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిలకొట్టుడు సాంగ్ ని బాలయ్య జయప్రద పాత్రధారిణి హన్సికతో కలసి చేశాడు. మరి ఈ సాంగ్ ఎంతలా కిక్కు ఇస్తుందో చూడాలి.


తాజాగా అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ సినిమాలోని స్టిల్ ఈ రోజు  బయటకు వదిలారు. అప్పుడు ఎన్టీఆర్, జయప్రద జోడీ ఎలా ఉందో.. అచ్చు అలాగే ఉంది బాలకృష్ణ, హన్సిక జోడీ.. అంటున్నారు ఈ స్టిల్ చూసిన ప్రేక్షకులు. అంతేకాదు ఈ స్టిల్ కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఉందని కితాబిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్‌తో స్టెప్పులేసిన నటీనటులను మరోసారి వెండితెరపై ఈ రకంగా ఆవిష్కరిస్తున్నందుకు ఎంతో ఆనంద పడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇలాంటి మరెన్నో సన్నివేశాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి కొద్ది గంటల్లో ఆ ముచ్చటకు శుభారంభమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: