టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి మీద టాలీవుడ్ లో ఆమెకు పొగరని, షూటింగ్ టైంలో యాటిట్యూడ్ చూపిస్తుందని, సహ నటీ నటులు టెక్నీషియన్లతో సరిగా నడుచుకోదని, ఇలా రకరకాల రూమర్లు రౌండ్ చేస్తూ వచ్చాయి ఇంతవరకు. ఆమెతో కలిసి ‘కణం’ సినిమాలో నటించిన యువ కథానాయకుడు నాగశౌర్య అయితే, బహిరంగంగానే సాయిపల్లవి తీరును దుయ్యబట్టాడు.  అయితే ఆమె అనుసరించే విధానం వేరుగా ఉంది 
sarvanand nani saipallavi కోసం చిత్ర ఫలితం
"ఫిదా" చిత్రం తర్వాత సాయిపల్లవి క్రేజ్ టాలీవుడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయం తోనే సాయిపల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయిపల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. సాయిపల్లవి చివరగా నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు హను రాఘవపూడి దర్శత్వంలో శర్వానంద్ సరసన నటించి న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 
beautiful saipallavi కోసం చిత్ర ఫలితం
ఎమోషనల్ లవ్-స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. విడుదలకు ముందే నిర్మాత సాయిపల్లవికి సగానికి పైగా రెమ్యునరేషన్ చెల్లినట్లు తెలుస్తోంది. 
సంబంధిత చిత్రం
ఈ చిత్ర నిర్మాతల విషయంలో సాయిపల్లవి తన మంచిమనసు చాటుకుంది.  ఆ ఉదంతం తాజాగా బయటికి వచ్చింది. ఇటీవలే ఆమె నటించిన  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచినా కూడా నిర్మాత సాయిపల్లవికి మిగిలిన రెమ్యునరేషన్ 40 లక్షల వరకు ఇవ్వడానికి సిద్దపడ్డా రట. అయితే నిర్మాతకు ఈ చిత్రంతో వచ్చిన ఆర్ధిక నష్టాన్ని గుర్తించిన సాయిపల్లవి దానిని తీసుకోలేదట. 
సంబంధిత చిత్రం
ఈ సమయంలో ఈ డబ్బు మీకు చాలా అవసరం అని నిర్మాతతో చెప్పిందట. సాయిపల్లవి తల్లి దండ్రులని పిలిపించి కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. మా కుమార్తె డబ్బు తీసుకోవద్దని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. దయచేసి డబ్బు తీసుకోమని బలవంతం చేయవద్దు అని ఆమె తల్లిదండ్రులు నిర్మాతతో తెలిపి నట్లు వార్తలు వస్తున్నాయి. 
sarvanand nani saipallavi కోసం చిత్ర ఫలితం
సాయిపల్లవి మంచి మనసు చాటుకోవటమే కాదు తన వ్యక్తిత్వంలో కూడా ప్రత్యేకత చాటుకుంది. సాయిపల్లవి తన కుటుంబ సభ్యులకు ఎంత గౌరవం ఇస్తుందో ఆమెని అభిప్రాయాలకు వాళ్ళు కూడా అదేవిధంగా విలువ ఇస్తారు. నా చిత్రాలన్నీ నా కుటుంబసభ్యులు చూసే విధంగా ఉండాలి. అందుకే గ్లామర్-షోలు, లిప్-లాక్ సన్నివేశాలకు దూరంగా ఉంటాను అని తెలిపింది. టాలీవుడ్ లో సాయిపల్లవి గురించి జరిగే దంతా ఎవరో గిట్టనివారు చేసే దుష్ప్రచారమని, ఆమె ఒక మంచి కోస్టార్ అని అంటున్నారు నాని, శర్వానంద్ లాంటి వాళ్లు.
 sarvanand nani saipallavi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: