ఎన్నో అంచనాల నడుమున ఎన్టీఆర్ కథా నాయకుడు రిలీజ్ అయ్యింది . ఇప్పటికే ప్రీమియర్ షోలు చుసిన పలువురు  సినిమా గురించి స్పందించారు. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన సినీరంగ విశేషాలు చూపించబోతున్నారు. ఎన్టీఆర్ వెండి తెరపై చేసిన పాత్రలు అభిమానులకు తెలుసు. కానీ తెర వెనుక స్టార్ గా ఎదగడానికి పడ్డ కష్టం మాత్రం తెలియదు. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతుండడంతో ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతికి రాబోతున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువగా నెలకొని ఉంది. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం! 

Image result for ntr kathanayakudu poster

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో బాలయ్య అద్భుత నటన ప్రదర్శించారు. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ సంగీత ఈ చిత్రానికి పెద్ద ప్లస్. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాస్టర్ పీస్ అనిపించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ బావుంది. అభిమానులు మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం. ఎన్టీఆర్ తోటరాముడుగా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు. 

Image result for ntr kathanayakudu poster

సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగాఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు ఘనవిజయం ఖాయం. చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. ఎన్టీఆర్ మహానాయకుడు కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ కథ నాయకుడు మొత్తం ఆయన సినీరంగంలో తిరుగులేని స్టార్ గా ఎలా అవతరించాడు అనే అంశం గురించే. ఎన్టీఆర్ ఆసక్తికరమైన ప్రకటనతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ముగుస్తుంది. ఎన్టీఆర్ వివిధ పాత్రల్లో నటించే సన్నివేశాలు నిరాశపరిచేలా ఉన్నాయి. ఆయన రియల్ లైఫ్ సీన్స్ బావున్నాయి. సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద బలం. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఒకసారి చూసే విధంగా ఉంది. కొన్ని సన్నివేశాలు కేవలం అభిమానులు మాత్రమే మెచ్చే విధంగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: