మరో రెండురోజులలో విడుదలకాబోతున్న ‘వినయ విధేయ  రామ’  సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత దానయ్య నుంచి 20 కోట్లు పైగానే పారితోషికం అందుకున్నాడని ప్రచారం అవుతోంది. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ నిర్మాతగా చిరంజీవితో నిర్మిస్తున్న ‘సైరా’ విషయంలో మెగా స్టార్ కు ఎంత పారితోషికం ఇస్తున్నారు అంటూ చరణ్ ను ఒక మీడియా ప్రతినిధి డైరెక్ట్ గా ప్రశ్నించాడు. 
జంజీర్ చిత్ర రీమేక్‌లో
ఈ ఆసక్తికర సంఘటన ‘వినయ విధేయ రామ’ మూవీ ప్రమోషన్ కోసం చరణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సందర్భంలో జరిగింది. అయితే ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన చరణ్ చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు. 
వినయ విధేయ తర్వాత RRR మూవీ
‘సైరా’ మూవీని అందరూ అనుకుంటున్నట్లుగా తాను 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం లేదనీ ఈమూవీకి ఖర్చు 300 కోట్ల వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు ఈసినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు తీసుకోనంత భారీ పారితోషికాన్ని తన తండ్రి చిరంజీవికి నిర్మాతగా తాను ఇస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి
ఇదే సందర్భంలో చరణ్ మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి ఎటువంటి రీషూట్స్ చేయడం లేదనీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈమూవీని ఈ ఏడాది దసరాకు తాము రిలీజ్ చేస్తున్నాము అంటూ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడమే కాకుండా ఈ ఏడాది దసరా రేసుకు మరి ఏపెద్ద సినిమాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్ చరణ్..  


మరింత సమాచారం తెలుసుకోండి: