అత్యంత భారీఅంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ చూసి బయటకు వస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయాల ప్రకారం కేవలం ఈసినిమాను ఒకసారి చూసే విధంగా మాత్రమే క్రిష్ రూపొందించాడని ఈమూవీకి రిపీట్ ఆడియన్స్ రావడం కష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈమూవీలో బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించిన ఎన్టీఆర్ గెటప్స్ కు ఇచ్చినంత ప్రాధాన్యత ఈమూవీలోని ఎన్టీఆర్ రియల్ లైఫ్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈమూవీ రేంజ్ బ్లాక్ బస్టర్ స్థాయికి ఎదిగిపోయి ఉండేదని ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకుల ప్రాధమిక అభిప్రాయం. 
సింపుల్‌గా ఎంట్రీ
అయితే ఈసినిమాను చూసిన ఓవర్సీస్ కు చెందిన నందమూరి అభిమానులు మాత్రం ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే ఈసినిమాను చూసిన సాధారణ ఓవర్సీస్ ప్రేక్షకుడి అభిప్రాయం ప్రకారం ఈమూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలబాగుంది అన్న అభిప్రాయాలు బయట పడుతున్నాయి. ఎన్టీఆర్ ‘తోటరాముడు’ గా నటించే సీన్స్ సావిత్రితో నటించే సన్నివేశాలకు ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
ఆ రెండు సీన్స్ అదుర్స్
ఇదే సందర్భంలో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోజులలో ఇండస్ట్రీ ఆధిపత్యం కోసం అక్కినేని ఎన్టీఆర్ ల మధ్య జరిగిన వార్ ను కొద్దిగా రేఖామాత్రంగా అయినా చూపెడితే బాగుండేది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈమూవీ చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు ఈమూవీని నిలబెట్టాయి అనివార్తలు వస్తున్నా సంక్రాంతి సినిమాల తీవ్రపోటీ మధ్య విడుదలైన ఈమూవీ కలక్షన్స్ పరంగా ఎంతవరకు సంచలనాలు సృష్టించగలుగుతుంది అన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.
సెకండ్ హాఫ్‌లో బలంగా
దీనికితోడు ‘కథానాయకుడు’ మూవీ విడుదలైన చాల ధియేటర్లలో ఆసినిమాను తీసివేసి ఎల్లుండి ‘వినయ విధేయ రామ’ రిలీజ్ అవుతున్న పరిస్థుతులలో కలక్షన్స్ పరంగా అద్భుతాలు కథానాయకుడు’ కి వచ్చే అవకాసం లేదు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. అయితే మన తెలుగురాష్ట్రాలకు సంబంధించి సగటు ప్రేక్షకుడు తీర్పు ఈమూవీ పై ఇంకా బయటకురాలేదు కాబట్టి ఈమూవీ ఏస్థాయికి చేరుకుంటుంది అన్న విషయం పై క్లారిటీ రావడానికి మరి కొన్ని గంటలు పడుతుంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: