హీరోయిన్ స్నేహ.. సంప్రదాయపు హద్దుల్లోనే అందాలు ఆరబోసిన అతికొద్దిమంది నటీమణుల్లో స్నేహ ఒకరు. ఎక్స్ పోజింగ్‌ కు ఏమాత్రం తావివ్వకుండా నిండైన కట్టుబొట్టుతో ఆమె చాలా కాలం తెలుగు తెరను అలరించారు. తొలివలపు చిత్రంతో హీరోయిన్‌ గా తెలుగు తెరకు పరిచయమై.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. హనుమాన్ జంక్షన్, ప్రియమైన నీకు, రాధాగోపాలం, వెంకీ, రామదాసు, పాండురంగడు, సంక్రాంతి వంటి హిట్ సినిమాల్లో నటించారు.



ఆ తర్వాత సహనటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు గుడ్‌ బై చెప్పిన స్నేహ మళ్లీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా వినయవిధేయ రామలోనూ నటిస్తున్నారు. ఆమె ఆలీతో సరదాగా షోకు హాజరై అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తమ పెళ్లికి ముందు ప్రసన్నే ప్రపోజ్ చేశాడని స్నేహ చెప్పారు.



తాను ఏడో తరగతిలో ఉండగా.. నాలుగో తరగతి అబ్బాయి తనకు లవ్‌ లెటర్ ఇచ్చిన విషయాన్ని అలీ ఆమెకు గుర్తు చేయగా స్నేహ షాకైంది. ఆ ప్రేమకు తాను అంగీరించానని కూడా చెప్పింది. తమిళనాడులో తన నవ్వుకు బెస్ట్ స్మైల్ అవార్డు కూడా ఇచ్చారని స్నేహ తనదైన మార్కు నవ్వుతో చెప్పింది.

చంద్రముఖి సినిమాలో వాస్తవానికి తానే నటించాల్సిందని కానీ అది అనుకోని కారణాల వల్ల మిస్సైందని స్నేహ చెప్పింది. రజినీకాంత్ హీరోగా అంటే ఎవరైనా గంతేసి ఒప్పుకుంటారు కదా. మరి మీరెందుకు నటించలేదు అన్న ప్రశ్నకు మాత్రం స్నేహ నుంచి కన్నీరే సమాధానమైంది.


తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తిరేపుతోంది. మరి స్నేహ కన్నీరెందుకు పెట్టుకుందో ఆ ఎపిసోడ్‌ లో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: