సోషల్ మీడియాలో నిరంతరం సందడి చేసే సమంత ప్రతి విషయం పైన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఈవిషయంలో సమంత చైతన్యల మధ్య చిన్న గ్యాప్ ఉన్న విషయాన్ని స్వయంగా సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. 

చైతన్య తనలా సోషల్ మీడియా విషయంలో ఆసక్తి కనపరచడని తనకు సంబంధించిన ఫోటోలు న్యూస్ ఏవీ కూడ సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు అంటూ తనకు కండిషన్స్ పెడుతున్న విషయాలను వివరించింది సమంత. అంతేకాదు తన విషయాలు ఏమైనా తాను సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తే చైతన్యకు బాగా కోపం వస్తున్న విషయాలను కూడ వివరించింది.

అయితే తాను చైతన్య అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు నటిస్తూనే అతడికి తెలియకుండా అతడి ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసే అలవాటు తనకు పెరిగిపోయింది అంటూ తన పై తానే సెటైర్లు వేసుకుంటోంది సమంత. పెళ్ళి అయిన తరువాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల పై దృష్టి పెట్టిన సమంత ఇప్పుడు నాని స్కెచ్ లో పడబోతున్నట్లు సమాచారం. 

ఈమధ్య విజయేంద్ర ప్రసాద్ క్రియేట్ చేసిన ఒక స్టోరీ నానీకి బాగా నచ్చడంతో ఆ కథతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమానుతీయాలని నాని ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఒక పవర్ ఫుల్ హీరోయిన్ పాత్ర చుట్టూ తిరిగే ఈకథకు సమంత అన్ని విధాల సరిపోతుందని నాని భావించడంతో ప్రస్తుతం ఈమూవీ విషయమై నాని సమంతతో రాయభారాలు చేస్తున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: