ఎన్టీఆర్ అంటేనే సంచలనం. మరి ఆయన పేరు మీద సినిమా తీస్తే అది సెన్సేషన్ కాకుండా ఉంటుందా. ఈ రోజు విడుదలైన అన్న గారి బొమ్మకు జనం నీరాజనం పడుతున్నారు. ఎన్టీఆర్ మూవీకి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. అన్న గారి పాత్రలో తనయుడు బాలయ్య ఒదిగిపోయారని అంటున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సతీమణి బసవరామ  తారకంగా విద్యాబాలన్ నటన ప్రశన్సనీయంగా ఉందని టాక్.


ఎన్నాళ్ళుగానే అభిమానులు ఎదురుచూస్తున్న అన్న గారి నిజ జీవిత కధతో తీసిన ఎన్టీఆర్ మూవీకి హిట్ టాక్ వచ్చింది. దేశంలోనూ, విదేశంలోనూ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం చిత్ర విజయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ మూవీలో అన్న గారి పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడని రివ్యూస్ చెబుతున్నాయి. ముఖ్యంగా రావణబ్రహ్మ, వెంకటేశ్వర స్వామి, దుర్యోధన పాత్రల్లోనూ బాలయ్య అదరగొట్టారంటున్నారు. 


ఇక భార్యభర్తల బంధం గురించి ఈ మూవీ చాటి చెప్పిందని కూడా అంటున్నారు. ఎన్టీఆర్ వెండి తెర వేలుపుగా ఎలా మారారన్నది ఈ మూవీని చూస్తే అర్ధం అవుతుంది. ఆయన ఎంతగానే పరిశ్రమించి సూపర్ స్టార్ డం తెచ్చుకున్నారన్నది ఈ మూవీలో తెలుస్తోంది ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సినిమాల్లో పెట్టిన పాటలు, సీన్లు కొంత కధకు అడ్డం పడినట్లు అనిపించినా మొత్తానికి చూసుకుంటే సినిమా మాత్రం బాగుందన్న హిట్ టాక్ సొంతం చేస్తుకుంది. సంక్రాంతి హీరో బాలయ్య తన సెంటిమెంట్ మరో మారు నిలబెట్టుకున్నారని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: