టాలీవుడ్ లో నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మళియాళ బ్యూటీ నిత్యామీనన్.  ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన నిత్యా హీరోయిన్ గానే కాకుండా సైడ్ యాక్టర్ గా కూడా నటించింది.  చాలా క్యూట్ గా బొద్దుగా ఉండే నిత్యా మీనన్ గ్లామర్ కి ఎప్పుడూ ప్రాదాన్యత ఇవ్వలేదు.  మొదటి నుంచి నటనపైనే దృష్టి పెడుతున్న ఈ బొద్దుగుమ్మ ఈసారి  అరుదైన .. ప్రయోగాత్మక సినిమాలో నటిస్తుంది.

ఈ మద్య లేడీఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్న నిత్యా మీనన్ తాజా మూవీ  'ప్రాణ' నిర్మితమైంది. ఈ సినిమాలో  ఒక్క నిత్యామీనన్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల‌లో రూపొందించినట్లు సమాచారం. మొదటి నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్న నిత్యా ‘ప్రాణ’ సినిమాతో ఓ వినూత్న ప్రయోగం చేయడంపై మొదటి నుంచి ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.
Image result for nitya menon prana movie
వీకే ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇతర భాష‌ల్లో ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 8వ తేదిన రిలీజ్ చేయ‌నున్నారు. కాగా,  ఫిబ్ర‌వ‌రి 7 వ‌ తేదిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు, వై ఎస్ ఆర్ బ‌యోపిక్ యాత్ర ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  మరి అంత పెద్ద సినిమాలతో ‘ప్రాణ’ ఎంత వరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: