ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేసిన ప్రయత్నంలో మొదటి భాగం ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టేశారు. సినిమా మొత్తం ఎన్.టి.ఆర్ గా బాలయ్య స్క్రీన్ స్పేస్ ఎక్కువే అని చెప్పాలి. ఆయన లేని సీన్ చాలా అరుదుగా ఉంటాయి.


క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. బాలకృష్ణ నట విశ్వరూపం బయోపిక్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో మనం చూస్తుంది బాలకృష్ణనా లేక ఎన్.టి.ఆర్ నా అనేలా ఉంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ గా కృష్ణుడి గెటప్ లో బాలకృష్ణ మెప్పించాడు.


ఇక పతాక సన్నివేశాల్లో పార్టీ పేరుని ఎనౌన్స్ చేసే సీన్ లో మాత్రం అబ్బో బాలకృష్ణ చితక్కొట్టాడు అని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ ఎపిసోడ్స్ మాత్రం ఎన్.టి.ఆర్ కథానాయకుడికి హైలెట్ గా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ అభినయంలో మరోసారి తన సత్తా చాటాడని చెప్పొచ్చు. అంతేకాదు క్లైమాక్స్ లో పార్టీ పేరుని ఎనౌన్స్ చేసే సీన్ అయితే తెలుగు తమ్ముళ్లు టిడిపి కార్యకర్తలను ఉర్రూతలూగించేలా చేసింది.


క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టాక్ బాగుంది కాబట్టి వసూళ్ల హంగామా కూడా అదే రేంజ్ లో ఉండేలా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అందరి చూపు రెండో పార్ట్ ఎన్.టి.ఆర్ మహానాయకుడు మీద ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: