క్రిష్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ గా రెండు పార్టులుగా ప్లాన్ చేశారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు రిలీజ్ అవగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో రానుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా అంచనాలను అందుకోవడమే కాకుండా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.


అసలైతే క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను ఒకే సినిమాగా రాసుకున్నాడట. అయితే అలా చేస్తే మూడున్నర గంటల సినిమా అవుతుందని ఆ సినిమానే రెండు పార్టులుగా చేశాడు. ఎన్.టి.ఆర్ కథానయకుడు సినిమా ఎన్.టి.ఆర్ సినిమా ప్రస్థానం చూపించారు. ఇక ప్రజల క్షేమమే లక్ష్యంగా పార్టీని ఎనౌన్స్ చేస్తాడు.


ఇక రానున్న సెకండ్ పార్ట్ ఎన్.టి.ఆర్ మహానాయకుడిగా ఎలా ఎదిగాడు అన్నది చూపిస్తారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఆపిన విధానం చూస్తే ఈ సినిమా బాహుబలిని గుర్తుకు వచ్చేలా చేస్తుంది. బాహుబలి సినిమాను అంతే.. ముందు ఒక పార్ట్ గా అనుకుని రెండు పార్టులుగా చేశారు. బాహుబలి బిగినింగ్ చివర్లో కట్టప్ప బాహుబలిని చంపడం చూపిస్తాడు. అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ట్రెండింగ్ గా మారింది.


ఎన్.టి.ఆర్ కథానాయకుడు కూడా ఎన్.టి.ఆర్ పార్టీ ఎనౌన్స్ మెంట్ తో ఆపేశాడు. ఇక మహానాయకుడిగా అక్కడ నుండి సినిమాను నడిపిస్తారు. అటు ఇటుగా అచ్చం బాహుబలి పంథాలో సాగుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈరోజు రిలీజైన సినిమా కూడా బాహుబలి రేంజ్ లో టాక్ తెచ్చుకుంది. కలక్షన్స్ అంత వస్తాయా రావా అన్నది పక్కనపెడితే సినిమా చూసిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా బాలకృష్ణ పెట్టిన ఎఫర్ట్స్ కు సూపర్ అనేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: