హైపర్ ఆది.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ కమెడీయన్‌.. అతికొద్దికాలంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు.. కొంతకాలం పాటు జబర్దస్త్ ప్రోగ్రామ్‌ కు గుండెకాయగా మారాడు. హైపర్ ఆది పంచ్‌లు అంటే చాలు..జనం వెర్రెక్కిపోయి చూసే స్టేజ్‌కు చేరుకున్నాడు.

Related image


ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్న హైపర్ ఆది ప్రస్తుతం కొన్నాళ్లుగా జబర్దస్త్ కు దూరంగా ఉంటున్నాడు. హైపర్ ఆదికి హీరో పవన్ కల్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఈ విషయాన్ని హైపర్ ఆది తన స్కిట్ల ద్వారా కూడా చెప్పాడు. పవన్ పై అభిమానంతో కత్తి మహేశ్ వంటి వారిపై స్కిట్లు రూపొందించి విమర్శలపాలయ్యాడు కూడా.



ఇప్పుడు అదే హైపర్ ఆది.. తన అభిమాన హీరో కోసం కెరీర్‌ ను సైతం త్యాగం చేస్తున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కోసం సీరియస్‌గా పని చేస్తున్నాడు. ఎన్నికల వరకూ ఫుల్‌ టైమ్‌ పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు హైపర్ ఆది.

Image result for hyper aadi with pawan kalyan


సాధారణంగా సినీ, బుల్లి తెర తారలు ఓ పార్టీలో చేరితే మిగిలిన వారి చేతిలో టార్గెట్ అవుతుంటారు. తాను పవన్ కారణంగా అలా అయినా పరవాలేదంటున్నాడు హైపర్ ఆది. పవన్ కోసం ఏమైనా చేస్తా.. నాకు సినిమా, టీవీ ఇండస్ట్రీలో ఆఫర్లు రాకపోయినా పర్వాలేదని బహిరంగంగానే చెబుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: