Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 7:24 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కథానాయకుడు - బయోపిక్ పూర్తిగా అసంపూర్ణం

ఎన్టీఆర్ కథానాయకుడు - బయోపిక్ పూర్తిగా అసంపూర్ణం
ఎన్టీఆర్ కథానాయకుడు - బయోపిక్ పూర్తిగా అసంపూర్ణం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తు పల్లాలను రెండింటిని సినిమాలో సమానంగా ఆవిష్కరిస్తే బాగుండేది. అలా కాకుండా కేవలం ఆయన విజయాల్ని, గొప్ప తనాల్నిచూపించడానికి మాత్రమే ఈ సినిమాలో ప్రాధాన్యమిచ్చారు. ఆయన సినీ జీవితంలో మంచిగా ఉన్న ఒక పార్శాన్ని మాత్రమే చూపించడంతో బయోపిక్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. అసలు జీవిత మంటేనే మంచి చెడుల కలయిక. అయితే ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని మంచితో నింపేశారు. నో మాన్ ఈజ్ యాన్ ఇలెండ్ – ఎవరూ నూరు శాతం పర్ఫెక్ట్ కాదు! అది మరవ కూడదు  కాని దర్శకుడో, మరోకరో ఈ విషయం ఈ సినిమా నిర్మాణంలో  పూర్తిగా మరచిపోయారు. నట జీవితంలో ఎన్టీఆర్ ఏ తప్పు చేయని పరమాత్ముడా? కథానాయకుడే ఇలా ఉంటే, ఇక సహజంగా లోప భూయిష్టమైన రాజకీయాలతో మిళితమై ఉండే  మహానాయకుడు ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
అలాగే ఆయన రాజకీయ ప్రయాణానికి దారి తీసిన పరిస్థితుల్నినిజానిజాల్ని పూర్తిగా చెప్పలేదు. ఎన్టీఆర్ కెరీర్‌ లోని గొప్ప సినిమాల్ని అందులోని పాత్రల ద్వారా సింపుల్‌ గా చెప్పే ప్రయత్నం చేశారు. వాటిలో ఆసక్తి లోపించింది. 
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
తండ్రి బయోపిక్‌లో కొడుకు కీలక పాత్రలో నటించడం అరుదనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాతో బాలకృష్ణ ఈ సాహసానికి పూను కున్నారు. తండ్రి పాత్రలో ఒదిగిపోయారు అనటం అతిశయోక్తే. మహానటుడిగా నీరాజనలందుకున్న తండ్రిని మాత్రం మరపించ లేకపోయారు. ఆహార్యం విషయంలో మాత్రం ఎన్టీఆర్‌ కు దగ్గరగా కనిపించారు. ఎన్టీఆర్ మేనరిజమ్స్ పలికిస్తూ సహజంగా నటించినా అది అనుకరణే. తండ్రి పోషించిన పలు పౌరాణిక పాత్రల్లో బాలకృష్ణకు నటించిన అనుభవం ఇది వరకు కూడా ఉంది. 


ఇక నటన కృషి అంటే బాలకృష్ణ  తన తండ్రి గుఱించి నటన గుఱించి అంతా తెలిసి 100 సినిమాలకు పైగా నటించిన అనుభవంతో అనుకరించటం అదీ క్రిష్ దర్శకత్వ ప్రతిభనీడలో గొప్పేం కాదు. ముఖ్యంగా రాజకీయ ప్రయాణానికి సంబంధించి సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ను చూసిన భావన కలుగుతుంది.  


హిపోక్రసీ లేకుండా చెప్పాలంటే ఇదే సినిమాని ఇదే క్రిష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తొ తీసి ఉంటే వెండి-తెర అల్లల్లాడిపోయుండేది. 

tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ అద్వితీయ అభినయాన్ని ప్రదర్శించింది. బసవ తారకం పాత్రకు విద్యాబాలన్ ఎంపిక నుంచి అనుకున్నదానికి మించి ఆపాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు రివర్స్ లో నిజ జీవిత బసవ తారకం గారికే వన్నె తెచ్చింది. ఇక బసవ తారకం పాత్రలో విద్యా బాలన్‌ను తప్ప మరొకరి ఊహించుకోలేనంతగా చాలా సహజ సిద్ధంగా చేశారు. నిజం చెప్పాలంటే సినిమాకు ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణ. 
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
దానికి కారణం కూడా ఒకటుంది. నందమూరి సహధర్మ చారిణి నిజజీవిత కథానాయకి బసవ తారకం గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అమెకు ఎనిమిది మంది పుత్రులను, నలుగురు పుత్రికలను సంతానంగా ప్రసాదించారు ఆ మహనీయుడు ఎన్టీఆర్. అంతకు మించి ఏమీ తెలియని ఆమెపై — ఎన్టీఆర్ గృహిణిగా ప్రేక్షక లోకంలో ఒక అద్భుత భావనను తన తన అద్వితీయ నటనతో ప్రసాదించింది విద్యాబాలన్, ఈ సినిమా తో బసవ తారకంగారికి భర్తగా ఎన్టీఆర్ తెచ్చిన వన్నె కంటే - నటన ద్వారా ఏనలేని కీర్తి,  ఔచిత్యం ప్రసాధించిన విద్యా బాలన్ నటన చిరస్మరణీయం. 

tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f

ఏఎన్నాఆర్‌ గా సుమంత్ పాత్ర ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య వచ్చే సన్ని వేశాలు అలరిస్తాయి. నాగారెడ్డిగా ప్రకాష్‌రాజ్, చక్రపాణిగా మురళీశర్మ, దాసరి నారాయణరావుగా చంద్ర సిద్ధార్థ, త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, కె.వి రెడ్డిగా క్రిష్, హెచ్.ఎం రెడ్డిగా సత్యనారాయణ ఇలా చాలా మంది నటీనటులు కనిపించేది కొద్ది క్షణాలే అయినా తమ అభినయంతో వాటిలో ఒదిగిపోయారు. ఈ పాత్రలు సినిమాలో అతిథుల్లాగే కనిపించారు.
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
ఈ బయోపిక్‌ ను కమర్షియల్ కోణం లో తెరపై ఆవిష్కరించడంలో క్రిష్ విజయవంత మయ్యారు. ఎన్టీఆర్ సినీజీవితంలోని భిన్న కోణాలను స్పృశిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సినీజీవితంలో ఏ పాత్రను గురించి చెప్పదలిచారో  వాటిని గురించి మాత్రమే చూపించారు. దర్శకుడిగా తన బాధ్యతకు వందశాతం న్యాయం చేశారని చెప్పలేం. ఇది బయోపిక్ కాకుండా సాధరణ సాంఘిక చిత్రం అంటే క్రిష్ నూరు శాతం న్యాయం చేసినట్లు చెప్పవచ్చు. సినిమా కోసం ఆయన చేసిన పరిశోధన, తపన ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. సంభాషణల రూపంలో ఎన్టీఆర్ జీవితం లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ కథను ముందుకు సాగించిన తీరు బాగుంది. 


1950-60 కాలం నాటి పరిస్థితుల్ని సహజంగా చూపించటంలో, కీరవాణి, సాయిమాధవ్, జ్ఞానశేఖర్ లాంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల అండ క్రిష్‌కు లభించడం ఈ సినిమాకు విజయం సాధించిపెట్టటానికి ఉపయోగపడింది. 
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
బయోపిక్ అంటే ఉప్పూ కారం, కష్టం నష్టం, న్యాయం అన్యాయం, మంచి చెడు - ఇలా భిన్న ధృవాలని స్పృజించాలి. కీలక పాత్రలో కథానాయకుని నటన అపూర్వం అనలేకపోయినా అద్భుతం అనవచ్చు. కీలక పాత్ర జీవితంలో వచ్చి పోయే పాత్రలను ఈ సినిమాలో పొషించిన నటీనటులు నటన అద్వితీయం. ఈ సినిమా వినోదం పంచింది కాని ఈ తరానికి ఎన్టీఆర్ గురించి సంపూర్ణంగా చెప్పలేదు. ఎన్టీఆర్ అసంపూర్ణ అసమగ్ర నటజీవిత చరిత్రగానే చెప్పవచ్చు. 
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
మనిషన్నాక లోపాలు ఉండవా? చిత్రసీమలో ఎన్టీఆర్ కు ఎన్నో ప్రేమ కథలు ఉండేవి లేవా? నటీమణులు కొందరు ఆయనతో ప్రేమలో వైఫల్యం చెందలేదా? ఆ సమకాలీన సమాజంలో మేమూ ఉన్నాం! ఎన్నో విన్నాం! ఆయన ఏ తప్పు చేయని పరమాత్ముడా? ఎన్టీఆర్ ఏదిగే ప్రయాణక్రమంలో నలిగి పోయిన చరిత్రలు లేవా?  జమున ఎస్వీఆర్ లు, ఎన్టీఆర్ ను మించిన నటులు కాదా? మన చరిత్రలో మనమే కథానాయకుడు కావచ్చు కాని మనకు మార్గదర్శకులైన వారు కీలకం కాదా? కొన్ని నిమిషాలైనా ఆ మహానీయుణ్ణి చూపించ లేదేం? 


నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సినిమా ఇది. ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్, ఆయన విజయాల్ని మాత్రమే చూపిస్తూ తెరకెక్కిన ఈసినిమా సగటు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాల్సిందే. అందుకే ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కాదు! ఎన్టీఆర్ కీలకమైన చారిత్రాత్మక గాధ! అంటే సరిపోతుంది. 
 
tollywood-news-ntr-kathanayakudu-not-biopic-just-f
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"ధిక్కారమున్ సైతునా!" అనే చంద్రబాబుకు సీఎస్ నుండి 'ఎక్జెక్యూటివ్ అధికారాలు' తెలుస్తున్నాయి!
చంద్రబాబు పై కన్నా కి వచ్చిన అనుమానమే! నేడు దేశమంతా వైరల్!
చంద్రబాబుకు షాక్‌! సుప్రీంకోర్టు ఆదేశాలతో 2005 కేసులో స్టే రద్దైంది! విచారణ మొదలైంది
న్యాయవ్యవస్థ ప్రతిష్టపై నీలినీడలు-సీజేఐపై లైంగిక ఆరోపణలు-నేడే విచారణ ప్రారంభం
బాలీవుడ్ లో మన బార్బీ బొమ్మ.....రష్మిక మందన్న!
కామ కోరికలు పెంచే మిరకిల్ హనీ ని అమెరికా ఎందుకు బాన్ చేసింది?
లోకెష్ లెక్క లో 900 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయట మన దేశంలో!
"హానర్‌ ఫోన్‌ " మార్కెట్లో విడుదలకు ముందే పోయిందట - తెచ్చి ఇస్తే ₹4 లక్షలు బహుమానం
ఐ ఓపెనర్: పవన్ కళ్యాన్ చదవాల్సిన మల్లంపల్లి వారి “రెడ్డి రాజుల చరిత్ర”
ఎడిటోరియల్: బాబు - టిడిపి చిమ్మిన విషం, పదింతలుగా ప్రచారం చేసిన సామాజిక వర్గ మీడియా
సైరా కథ చెప్పనున్న స్వీటీ
పాపం! బాబు టైం బాలేదు! ఎన్నికల్లో ఆయన ఎదురులేని మనిషేనట: సి.ఓటర్-ఐఏఎనెస్ ట్రాకర్
తగ్గిపోతున్న అవకాశాలతో, ఉద్యోగాలు కోల్పోతున్న మహిళలు
రాశీ రస రంగేళి…నృత్యం అదిరిందిగా!!
బాహుబలి ప్రభాస్‌ కు భూ వివాదంలో ఊరట: తెలంగాణా హైకోర్ట్
చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతీ చోటా అభ్యర్ధులు ఓడిపోబోతున్నారట!
గందరగోళం కాదది గుండెలుపిండిన కుంభకోణం
చంద్రబాబు సమీక్షల పట్ల టిడిపి వారి నుండే తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమౌతుంది!
“ఒక్క చాన్స్ ఇచ్చి చూద్ధాం!” అనే జనం - అదే జగన్ గెలుపు!
చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?
పిల్లల భవిష్యత్ తగలడుతుంటే "కింగ్ కేసీఆర్ నీరోలా ఫిడేల్ వాయిస్తున్నారా!”  ప్రజల ఆక్రోశం
వైసీపీ గెలుపు లో జనసేన పాత్ర కీలకం
తెలుగుదేశం ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం అత్యవసరమేనా!
అవకాశాల కోసం ఫ్లడ్-గేట్లు ఎత్తేసి అందాల ఆరేస్తున్నారా! పారేస్తున్నారా!
తెలంగాణా ఇంటర్ బోర్డ్ ఫెయిలైంది - విద్యార్దులు కాదు!
నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు
అందాల జయప్రదపై వివాదాల ఆజంఖాన్‌ పోటీ
విష సంస్కృతి విష వలయంలో విశాఖ ! ఇక విలయమే
About the author

NOT TO BE MISSED