ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో చివరిగా డిసెంబర్ 12న వస్తున్న ‘ఎఫ్ 2’ ఊహించని విజయం సాధిస్తుందని ఈసినిమాను నిర్మించిన దిల్ రాజ్ చాల ఆసలు పెట్టుకున్నాడు. గత సంవత్సరం డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా దిల్ రాజ్ కు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు అన్నింటిని ‘ఎఫ్ 2’ కవర్ చేస్తుంది అన్న నమ్మకం దిల్ రాజ్ చేత ఈ సాహసం చేయిస్తోంది.
F2 Movie Diwali Poster and Still
ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీలో నటించిన జూనియర్ లు వరుణ్ తేజ్ మెహరిన్ లకు ఇదే మూవీలో నటించిన సీనియర్లు వెంకటేష్ తమన్నాల వల్ల అన్యాయం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలోని వెంకటేష్ పాత్ర వరుణ్ తేజ్ కన్నా ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా ఈమూవీలో నటించినందుకు వెంకటేష్ కు ఐదు కోట్ల పారితోషికం వస్తే వరుణ్ తేజ్ కు మూడు కోట్లు మాత్రమే ఇచ్చారని ఇండస్ట్రీ టాక్.
F2 - Fun And Frustration Movie Latest Poster
అదేవిధంగా ఈమూవీలో తమన్నా పాత్రకు లభించిన ప్రాధాన్యత యంగ్ హీరోయిన్ మెహరిన్ కు ఇవ్వలేదనీ అదేవిధంగా తమన్నాకు కోటి రూపాయల పారితోషికం ఇస్తే మెహరిన్ కు అందులో సగం కూడ ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీకి సంబంధించి ప్రముఖ పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఎక్కువగా వెంకటేష్ ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయి.

‘గురు’ తరువాత వెంకటేష్ చాల విరామం తీసుకుని నటించిన ఈసినిమాలో చాల ఫ్రెష్ గా మరియు ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. దీనికితోడు ఈసినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కావడంతో ఈమూవీ ఎవరూ ఊహించని విధంగా సక్సస్ సాధిస్తుంది అన్న టాక్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: