గత ఏడాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.  గతంలో ఈ కాంబినేషన్ లో రోబో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఆ సినిమా తర్వాత రజినీకాంత్ నటించిన లింగ, కబాలి, కాలా వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.  దాంతో రజినీకి మంచి హిట్ పడాల్సిన సమయంలో 2.0 తో ఆ కోరిక తీరింది.  ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాదించినట్లు టాక్.  అయితే 'కబాలీ', 'కాలా', '2.0' ఈ సినిమాల్లో తాము ఆశించిన రజినీ కనిపించలేదని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. 
Related image
అయితే అభిమానుల కోరిక ‘పెట్టా’తో తీరబోతుందట.  ఈ ఉదయం  విడుదలైన 'పేట' మాత్రం 1990 దశకంలో రజనీని గుర్తు చేసిందట. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడగా, చిత్రం చూసిన వారు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రజినీకాంత్ మాస్ ఇమేజ్ ని మరింత పెంచేలా ఉందట. 
Related image
ఒకప్పుడు రజినీ స్టైల్ గా నడవటం..సిగరెట్, జుట్టు ఎగరేయటం ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ తెగ థ్రిల్ అయ్యేవారు.. అవన్నీ ఈ పెట్టా సినిమాలో కనిపిస్తున్నాయట...దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం సూపరని అంటున్నారు. పెట్టా పక్కా మాస్ సినిమా అని, ‘బాషా’ను మించిపోయిందని చెబుతున్నారు.
Image result for petta movie posters
రజినీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు..అన్ని చక్కగా కుదిరాయని అంటున్నారు. ఇక  ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని మరికొందరు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. చాలా కాలం తరవాత పాత తలైవా తిరిగి కనిపించాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: