రేపు విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామ’ ను ప్రమోట్ చేస్తూ రామ్ చరణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ ఆర్ ఆర్’ కథ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. చాలామంది అనుకుంటున్నట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ కథ పూర్తిగా రెడీ అవ్వలేదు అన్న వార్తలు అవాస్తవం అంటూ కామెంట్స్ చేసాడు. 

రికార్డుల పై రామ్ చరణ్ బయటపెట్టిన తలనొప్పులు !
ఈకధను రాజమౌళి కొన్ని నెలల క్రితం పూర్తిగా తనకు జూనియర్ కు చెప్పిన విషయాలు గుర్తుకు చేసుకుంటూ ఆకథ విన్న తరువాత రెండు నిముషాల పాటు తమ ముగ్గురి మధ్య నిశ్శబ్దం ఆవరించిందని ఆకథ విన్న షాక్ కు తాను తేరుకోలేకపోయాను అంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ కథ పై అంచనాలు పెంచుతున్నాడు చరణ్. అంతేకాదు తాను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసిన జూనియర్ ఆనిశ్శబ్దంలో తిరిగి మాట్లాడే వరకు తన మైండ్ బ్లాంక్ అయిన విషయాలను బయటపెట్టాడు.

చిరంజీవి పారితోషికం పై చరణ్ ఆశక్తికర వ్యాఖ్యలు !
ఇదే సందర్భంలో మరొక ఆసక్తికర విషయాన్ని వివరిస్తూ చరణ్ ఇందులో తన పాత్రకు ఎలాంటి గ్లామర్ ఉండదని చాల డీ గ్లామర్ గా తాను ‘ఆర్ ఆర్ ఆర్’ లో కనిపించబోతున్న విషయాన్ని లీక్ చేస్తున్నాడు. అంతేకాదు ‘బాహుబలి’ మూవీలా ఈమూవీలో ఊహించని ట్విస్ట్ లు ఉండవని అయితే ఈమూవీలో భావోద్వేగాలు మాత్రం చాల ఎక్కువగా ఉంటాయి అన్న విషయాలను వివరించాడు చరణ్.

చిరంజీవి పారితోషికం పై చరణ్ ఆశక్తికర వ్యాఖ్యలు !
దీనినిబట్టి చూస్తుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ కథలో చెప్పుకోతగ్గ ట్విస్ట్ లు సంచలనాలు ఉండవు అనే లీకులను వ్యూహాత్మకంగా చరణ్ ఇస్తున్నాడు అనుకోవాలి. ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించి అనేక రూమర్లు హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు చరణ్ చెపుతున్న మాటలు మరింత ఆసక్తి దాయకంగా ఉన్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: