రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ‘జనసేన’ సిద్ధం చేసిన ఒక కొత్త ప్రణాళిక ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ‘క్షేత్ర ఫర్ జనసేన’ పేరిట ప్రతి గ్రామంలోను కమిటీలు ఏర్పాటు చేసి ‘జనసేన’ సిద్ధాంతాలను ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలోను ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పవన్ తన అభిమానులకు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమధ్య పవన్ తనను కలుస్తున్న ‘జనసేన’ నేతలతో మాట్లాడుతూ రాబోతున్న ఎన్నికలలో ఎక్కువ శాతం సీనియర్లకు టిక్కెట్లు ఇస్తానని అభిమానులు ఈ విషయమై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సీనియర్లను గెలిపించే బాధ్యత తమ భుజాల పై పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు జనసేన నిలబడాలి అంటే యువతతో పాటు అనుభవం కలిగిన వ్యక్తులు కూడ ఉండాలి అంటూ పవన్ తన అభిమానులను మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా పవన్ ఈ నూతన సంవత్సరం నుండి తన ఉపన్యాసాలలో విమర్శలు చేస్తూ మాటలు మాట్లాడటం బాగా తగ్గించి వేసాడు.  ముఖ్యంగా గత కొంతకాలంగా మాట్లాడిన మసాలా మాటలు చప్పట్లు కొట్టిస్తాయి కానీ ఓట్లు పడేలా చేయవు అన్న వాస్తవాన్ని పవన్ ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి పవన్ రాబోతున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కు చెందినా 175 పోటీ చేస్తాను అని చెపుతున్నా పవన్ ఆలోచనలలో మాత్రం కేవలం ఒక 75 సీట్లు మాత్రమే పోటీ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని దీనితో మిగిలిన ఆ 100 సీట్లు ఎవరికీ కావాలి అన్న సంకేతాలు పవన్ వివిధ రాజకీయ పార్టీలకు ఇస్తూ తాను కన్ఫ్వ్యూజ్ అవుతూ తన కేడర్ ను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటూ పవన్ తీరు పై ‘జనసేన’ వర్గాలు కూడ అయోమయంలో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: