క్యాలండర్ లో ఇయర్ మారితే ఎవరి లెక్క ఏంటో తెలిసిపోతుంది. కాల మహిమ అది. ఒకరిని పెద్ద చేయదు, మరొకరిని చిన్నగా చూపదు, మరి అటువంటిది కొందరికి మాత్రం ఆ క్యాలండర్ సరండర్ అయిపోతుందేమో. వారికి అంకెలు కూడా కొత్త అందాలు తెస్తాయేమో


గ్లామర్ ని ఒడిసిపట్టడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అది ఇంకా కష్టం. వారి కెరీర్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. హీరోల విషయంలో అరవైలో కూడా ఇరవై అవ్వొచ్చేమే కానీ హీరోయిన్లు అలా కాదు. మరి గత దశాబ్దన్నర కాలం పైగా వెండి తెరపై కధానాయికగా అలరిస్తున్న శ్రియా శరణ్ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ఆమె ఏజ్ ఎక్కడో లాక్ చేసినట్లుగా ఉండిపోయింది. ఇప్పటికి పడుచు అందాల పదహారులా శ్రియ కనిపిస్తూ మురిపిస్తోంది.


 
ఇంకో  విశేషం ఏంటంటే శ్రియ పెళ్ళి అయి కూడా కొత్త అందాలను సంతరించుకుని మరీ ముందుకు వస్తోంది. ఎప్పటికపుడు వన్నె తగ్గని సోయగాలతో సోకు చేస్తూనే ఉంది. ఇప్పటికి కొన్ని  తెలుగు సినిమాలకు శ్రియ బెస్ట్ ఆప్షన్ గా ఉంటూ టాలీవుడ్ ని అలరిస్తోంది. . గౌతమి పుత్ర శాతకర్ణి మూవీలో కీ రోల్ ప్లే చేసిన శ్రియ ఈ ఏడాది మళ్ళీ బాలయ్యతో మరో మారు అన్నగారి మూవీలో మెరిసింది. చిత్రం భళారే విచిత్రం అంటూ పాట పాడింది కూడా. 


ఇక శ్రియ న్యూ ఇయర్ వేడుకలు ఈజిప్ట్ దగ్గర సాగర తీరంలో జరుపుకుంది. ప్రక్రుతి అందాలను ఆస్వాదిస్తూ తనలోని అందాలను కూడా జోడిస్తూ ఇన్స్టాగ్రాం లో శ్రియ పెట్టిన హాట్ హాట్ ఫొటోలు ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. శ్రియ ఎవర్ గ్రీన్ అని ఆ పిక్స్ చూసిన వారు అంటున్న మాట. ఈ అమ్మడు వయసు వెనక్కిపోతోందే అని కూడా అంటున్నారుట.
 


మరింత సమాచారం తెలుసుకోండి: