ఎన్టీఆర్ కధానాయకుడు మూవీలో గొప్ప విషయాలు చాలా చూపించారు. అందులో అతి ముఖ్యమైనది ఇద్దరు హీరోలు పోటా పోటీగా ఉంటూ కూడా తమ వ్యక్తిగతమైన జీవితాలకు దాన్ని చేరనీయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది అక్కినేని ఎన్టీఆర్ పాత్రలు చాటి చెప్పాయి. ఆరోగ్యకరమైమ పోటీ ఉండాలని ఆ ఇద్దరు మహా నటులు తమ కెరీర్ ద్వారా రుజువు చేశారు. అందుకే వాళ్ళ యుగం స్వర్ణ యుగం అయింది. ఇపుడు అటువంటి పరిస్థితి ఉందా అంటే జవాబు అందరికీ తెలిసిందే.


ఎన్టీఆర్ కధానాయకుడు మూవీ విషయానికి వస్తే  టాలీవుడ్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరో మారు బయటపడ్డాయా అనిపించకమానదు. తెలుగు చిత్ర సీమ చాణ్ణాళ్ళు ఓ వర్గం  వారి అధీనంలోనే ఉంది. చిరంజీవి ఎంట్రీ ఇచ్చాక మెల్లగా ఆయన మరో  వర్గం ఆధిపత్యం పెరుగుతూ వచ్చి ఇపుడు టాలీవుడ్ ని శాసించే స్థాయికి చేరుకుంది. మెగా ఫ్యామిలీ అంటే డజనుకు తక్కువ లేకుండా హీరోలు ఉన్నారు. ఇక సినిమా హాళ్ళు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు అందరూ ఆ వర్గంలో గట్టిగానే ఉన్నారు.


మరో వైపు  రెండవ వర్గం  హీరోలు కూడా ఉన్నా వెనకటి ప్రాభవం లేదన్న వెలితి మాత్రం ఉంది. కమ్మ హీరోల విషయంలో గట్టిగా తొడ కొట్టి చెప్పుకోవడానికి బాలక్రిష్ణ మాసిజంతో కనిపిస్తారన్నది అందరి మాట. బాలయ్య తో పాటే వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఉన్నా కూడా కమ్మ వారు ఎక్కువగా ఓన్ చేసుకునేది మాత్రం బాలయ్యనే.ఎందుకంటే ఆయనే చిరంజీవికి చాలాసార్లు పోటా పోటీగా నిలబడ్డారు. సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది పక్కన పెడితే ఆ తరంలో వారిద్దరు టాప్ స్టార్లుగా వెలుగొందారు. ఇక ఇపుడు కూదా బాలయ్య అదే స్పీడ్ తో ఉన్నారు. చిరంజీవి సినిమాల్లోకి మళ్ళీ వచ్చేశారు. దానికి తోడు కొత్త తరం కూడా వచ్చింది.


ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బ్లాక్ బస్టర్ హిట్లు అందరూ కొడుతున్నారు కానీ ఆధిపత్యం విషయంలో మాత్రం రెండు వర్గాల మధ్య తెర వెనక పోరు అలాగే వుందన్నది కొందరి భావన. అది సందర్భం   వచ్చిన ప్రతీ సారీ బయటకు వస్తోంది. ఇపుడు ఎన్టీఆర్ కధానాయకుడు మూవీ ద్వారా  మరో మారు బహిర్గతమైందని అంటున్నారు. ఎన్టీయార్ని చూపించి  తెలుగు జాతి కీర్తి,  ఇదీ సినిమా స్టామినా అని ఓ వర్గం సంబర పడుతూంటే, మరో వర్గం సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని నెగిటివ్ ప్రాచారం చేస్తోంది. 


ఇది మొత్తం తెలుగు జాతి సినిమా అని ఓ వైపు ప్రచారం చేస్తూంటే మరో వైపు మూవీ మీద బ్యాడ్ కాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంచి సినిమాలు వచ్చినా కూడా కులం కోణం నుంచి చూడడం, ఇండస్ట్రీ పెద్దల సినిమాలు బయోపిక్ గా తీసినా అపహాస్యం చేయడం వంటివి ఎంతవరకూ సబబు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ కే ఈ ధోరణి బాగా ఉందని కూడా అంటున్నారు. క్యాలండర్ లో ఇయర్స్ మారుతున్నా ఈ ధోరణి మాత్రం మారడంలేదని సినిమా పెద్దలు బాధపడుతున్నారంటే అది నిజమే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: