హీరోయిన్ అంజలి పని గోవిందా, ఆమెకు నాన్ బెయిలబుల్ వారంటును గురువారం చెన్నై కోర్టు జారీ చేసింది. అంతే కాదు అక్టోబరు మూడో తేదిలోగా కోర్టులో సరెండర్ కాకపోతే వెంటనే అరెస్టు చేయండి అంటూ అరెస్ట్ వారంట్ కూడా జారిచేసింది. దీంతో అంజలి కోర్టు మెట్టు ఎక్కుతుందా.. లేక జైలు ఊచలు లెక్కబెడుతుందా అనేది చూడాల్సి ఉంది.

అప్పట్లో ఆమె అదృష్యం డ్రామా ఆడినప్పుడు దర్శకుడు కళంజియం పై ఆమె ఆరోపనలు చేయగా ఎప్రిల్ లో ఆయన అంజలిపై పరువునష్టం దావా వేసారు. అప్పటి నుంచి ఆమె పదిసార్లు ఆమె కోర్టు ట్రయల్స్ కు గైర్హాజరయ్యారు. ఇప్పటికే పలు మార్లు న్యాయమూర్తి ఆమె వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

చివరకు కోర్టు సూచనల మేరకు దర్శకుడు కళంజియం ఆమె కోర్టుకు హాజరుకావాలని జారీ చేసిన సమన్ల విషయాన్ని ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. మళ్లీ గురువారం ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా రాలేదు, పైగా ఆమె తరఫున మొదటి సారి ముకుందం అనే న్యాయవాది వచ్చి ఈసారి కాదు తదుపరి విచారణకు అంజలి హాజరవుతుంది అని పిటిషన్ దాఖలు చేయగా దానిని న్యాయమూర్తి డిస్ మిస్ చేసి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: