నిన్న సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ను చూసిన తరువాత చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. మొదట్లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను తీయబోతున్నాను అని తనకు చెప్పినప్పుడు ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ మెప్పించగలడా అన్న సందేహం తనకు కలిగిన సందర్భాన్ని వివరించారు చంద్రబాబు. 
2 డేస్ టోటల్ ఎంత?
అయితే ఈమూవీ చూసిన తరువాత తన సందేహాలు అన్నీ నివృత్తి అయ్యాయని ఎన్టీఆర్ పాత్రలోకి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేసాడు అంటూ బాలయ్య పై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు. 30 సంవత్సరాల ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని కేవలం మూడు గంటలలో చూపించడం చాల కష్టం అంటూ ఆవిషయంలో తన ప్రతిభను కనపరిచిన క్రిష్ ను అభినందించాడు చంద్రబాబు. 
రైట్స్ ఎంతకు అమ్మారు?
ఇదే సందర్భంలో తన పాత్రను పోషించిన రానా పై మీఅభిప్రాయం ఏమిటి అని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన పాత్రను రానా ఎంతవరకు పోషించగలిగాడు అనే విషయం మీడియా వర్గాలు మాత్రమే తేల్చాలి అంటూ నవ్వుతు సమాధానాన్ని దాట వేసారు. ఇది ఇలా ఉంటే ఈమూవీలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించి క్రిష్ చూపించిన కొన్ని సన్నివేశాల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు
హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఈవిషయం రామోజీరావు నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా బసవతారకం తెలుసుకున్నట్లు ‘కథానాయకుడు’ మూవీలో క్రిష్ చూపించాడు. దీనితో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ విషయాన్ని భార్య కంటే ముందే రామోజీకి ఎన్టీఆర్ చెప్పినట్లుగా అవుతుందని అంటూ ఇది బసవతారకం బయోపిక్ కాదు ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: