అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఎన్టీఆర్ బయోపిక్ కలక్షన్స్ విషయంలో భిన్నాభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీ సాధారణ ప్రేక్షకుడి విషయంలో ఎటువంటి మ్యానియాను సృష్టించని నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ విషయంలో  రెండురకాల మాటలు వినిపిస్తున్నాయి. 
తొలి రోజు ఎంత వసూలు చేసింది?
ఈసినిమా విడుదలకు ముందు నుంచి ఈమూవీ పై ఒక వర్గం విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేయడంతో పాటు కేవలం ఈమూవీని రాజకీయ ప్రయోజనాలకు ఆశించి తీసారు అన్న ప్రచారం తారా స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. దీనికితోడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు స్పందించని నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెపుతూ ఎన్టీఆర్ బయోపిక్ తీయడం ఏమిటి అంటూ చేస్తున్న నెగిటివ్ ప్రచారం ఈమూవీ కలక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు
వాస్తవానికి ఈసినిమాను ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ పై భారీగా బాలకృష్ణ అతడి సన్నిహితులు ఇన్వెస్ట్ చేసారు. ఈమూవీకి అయిన ఖర్చు 70 కోట్ల వరకు ఉంటే ఈసినిమాకు 100 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే ఈమూవీకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ఈమూవీ నిర్మాతలు విడుదల చేసిన ఈమూవీ కలక్షన్ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. 
2 డేస్ టోటల్ ఎంత?
ఈమూవీ నిర్మాతలు ‘కథానాయకుడు’ మొదటిరోజున ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అధికారిక పోష్టర్ రిలీజ్ చేసారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇది పూర్తి అబద్ధపు సమాచారం అనీ మొదటిరోజు ఈమూవీ 7 కోట్లు గ్రాస్ 2వ రోజు 5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. దీనితో ‘కథానాయకుడు’ కొనుక్కున్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పవు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: