ప్రముఖ దర్శకులు క్రిష్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది.  ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఈ సినిమాలో చాలా బాగా చూపించారని..కొన్ని సీన్లలో ఎన్టీఆర్ ని చూసినట్లే అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.  ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా తీశారు. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ సినిమా పై పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ప్రశంసిస్తున్నారు. బాలయ్య నటన నిజంగా మహాఅద్భుతం అంటూ మెచ్చుకుంటు న్నారు.  తాజాగా ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.  శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు చంద్రబాబును కలుసుకున్నారు.  తన విలువలు, భావాలతో రాజీపడలేక ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.  ఆ కాలంలో వెండితెరపై గొప్ప నటుడు అయినప్పటికీ.. ప్రజల కోసం జోలె పట్టి విరాళాలు స్వీకరించారనీ, సొంతంగా విరాళం ఇచ్చి స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు.

నిన్న రాత్రి ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమాను చంద్రబాబు వీక్షించారు. అమరావతిలో టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ సినిమాను ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారని, క్రిష్‌ మంచి చిత్రరూపం ఇచ్చారని కితాబునిచ్చారు. ఎన్టీఆర్‌ జీవితాన్ని, కార్యదక్షతను, త్యాగాన్ని ప్రజలకు అర్థమయ్యే రూపంలో చిత్ర రూపం ఇచ్చారని ఇద్దరినీ ప్రశంసించారు. 
Image result for ntr biopic
తుపాను బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆరే నేర్పించారని సీఎం వెల్లడించారు. తాను గుడిసెలో నివసించే నిరుపేదల బాధలు చూశాననీ, అందుకే పేదలందరికీ కాంక్రీట్ శ్లాబుతో పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.ఎన్టీఆర్ 30 ఏళ్ల చరిత్రను దర్శకుడు క్రిష్, చిత్ర యూనిట్ 3 గంటల్లో చూపిందని చంద్రబాబు ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: