లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మిపార్వతి పాత్రను ఫస్ట్‌-లుక్‌‌ గా విడుదల చేశాడో లేదో, వెంటనే వర్మ మరో పాత్రకు సంబందించిన ఫోటోను విడుదల చేశాడు. అది చంద్రబాబు క్యారెక్టర్ అని అందరికి తెలిసినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అంటూ తన ట్విట్టర్ లో ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. వైరల్ గా మారిన ఆ ఫొటోస్ చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు.



‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి గా ఎవరు కనిపించబోతున్నారని చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక మంది నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌-లుక్‌‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో కన్నడ నటి యజ్ఞా షెట్టి  టైటిల్‌ పాత్రలో కనిపించ నున్నట్లు తెలిపారు. ఆమె గతంలో వర్మ తీసిన కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఒక కన్నడ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌-ఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు.

లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని ఆయన విడుదల చేశారు. "వెన్నుపోటు" అనే పాటను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఈ సినిమాకు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురా బోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఈ సినిమాలోని పాటలు తనను చాలా బాధించాయని ఇటీవల మీడియాతో లక్ష్మీపార్వతి అన్నట్లు సమాచారం.

అదేవిధంగా ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌-లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తున్నారో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించేశారు. చంద్రబాబు పాత్రలో హీరో శ్రీతేజ్ నటిస్తున్నారంటూ ట్వీట్ చేసి మరీ వెల్లడించారు. శ్రీ తేజ్ కళ్లలో తెలియని శక్తి దాగుందంటూ కితాబు కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో కనిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజ జీవితాల్లో రాజకీయనాయకుల పాత్రలకు శ్రీ తేజ్ బాగానే సెట్ అవుతున్నాడు. మరి సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.
 Yagna-Shetty-at-Octopus-movie-audio-release-(1)
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో రాజశేఖరరెడ్డి పాత్రలో నటించి మెప్పించిన శ్రీతేజ్, వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో చంద్రబాబు పాత్ర పోషిస్తుండటం గమనార్హం. శ్రీతేజ్ గతంలో వంగవీటి, టచ్ చేసి చూడు, ఆటగాళ్లు తదితర సినిమాల్లో నటించారు. వంగవీటి సినిమా లో దేవినేని నెహ్రూ పాత్ర ద్వారా శ్రీతేజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

lakshmi's ntr cast కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: