ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగం విడుదలైంది. ఫరావాలేదనే టాక్ తెచ్చుకుంది. సెకండ్ పార్ట్ కూడా వచ్చేనెల తెరపైకి రాబోతోంది. ఈ సమయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ జోరు పెంచేస్తున్నాడు.

Image result for యజ్ఞా శెట్టి


ఇప్పటికే వెన్నుపోటు సాంగ్ రిలీజ్ చేసి హంగామా చేసిన వర్మ.. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్‌ లో నటీనటులను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతిగా యజ్ఞా శెట్టి నటిస్తున్నారు. యజ్ఞా శెట్టి గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలోనూ నటించారు.

Image result for యజ్ఞా శెట్టి


కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో యజ్ఞాశెట్టి వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ పాత్ర పోషించింది. ఇక యజ్ఞాశెట్టి విషయానికి వస్తే ఈ కన్నడ నటి 2007లో తన సినీప్రస్థానం ప్రారంభించిందిఇటీవల ఆమె కన్నడ టీవీ ప్రోగ్రామ్స్‌ లో నటిస్తోంది. అన్నట్టు ఈ ముత్తులక్ష్మీ మణిపాల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ కూడా చేసిందండోయ్.

Image result for యజ్ఞా శెట్టి


ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుంచే తన సినిమా కథ మొదలవుతుందని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. అలాంటి కీలక పాత్రకు యజ్ఞాశెట్టి ఎలా న్యాయం చేసిందో త్వరలోనే తెలిసిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: